మహేశ్-నయనతార కాంబోలో మిస్ అయిన మూడు సినిమాలు ఇవే.. అన్ని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్సే..!!

సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి టాప్ పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనతో సినిమా అవకాశం వస్తే హీరోయిన్స్ ఎగిరికి గంతేసి మరి ఒప్పుకుంటారు . మరి అలాంటిది ఆయనతో అవకాశం వచ్చి చేజార్చుకున్న హీరోయిన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు . అయితే చాలా మంది హీరోయిన్స్ విషయంలో చాలా సాఫ్ట్ గా ఉండే మహేష్ బాబు ఓ హీరోయిన్ విషయంలో మాత్రం ఫుల్ కోపంగా ఉన్నారట. ఆమె నయనతార . ఎంతోమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు .. నయనతార తో ఒక్క సినిమా కూడా చేయలేదు.

దానికి కారణం ఆమెకున్న హెడ్ వెయిట్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . నిజానికి ఒక్కడు సినిమాలో భూమిక కన్నా ముందు హీరోయిన్గా నయనతారాని అనుకున్నారట . కానీ ఆమె ఓవర్ కండిషన్స్ పెట్టడంతో మహేష్ కి కోపం వచ్చే సినిమా నుండి ఆమెను తీసేసారట . ఆ తర్వాత దూకుడు సినిమాలో కూడా నయనతారను హీరోయిన్గా చూస్ చేసుకున్నారట మేకర్స్ . అప్పుడు ప్రమోషన్స్ కి రాను అంటూ ఓవర్ ఆక్టింగ్ చేసిందట.

దీంతో రెండోసారి సైతం నయనతార మహేష్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది. ముచ్చటగా మూడోసారి సరిలేరు నీకెవరు సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. అయితే ఈసారి అమ్మడు ఏకంగా హద్దులు మీరిపోయింది మహేష్ కన్నా సీన్స్ ఎక్కువగా తనకే ఉండాలి అని తన కథను మొత్తం మార్చేయాలి అంటూ డైరెక్టర్కు కండిషన్ పెట్టిందట దీంతో మూడోసారి కూడా మహేష్ రిజెక్ట్ చేశాడు . అలా మూడు సినిమాలు బిగ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అలా మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను నయనతార మిస్ చేసుకుంది..!!