లిప్ లాక్ సీన్స్ లేవని..పవన్ కళ్యాణ్ తో మూవీ ఛాన్స్ వచ్చిన రిజెక్ట్ చేసిన రష్మిక..ఆ హిట్ మూవీ ఇదే.!?

రష్మిక మందన్న.. ఈ మధ్యకాలంలో ఈ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అమ్ముడు పేరు మారుమ్రోగి పోతుంది . రీసెంట్గా రష్మిక మందన్నాకి సంబంధించిన ఫేక్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది ..ఆమెకు సెలబ్రిటీలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే రష్మిక – పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నింది అన్న వార్త వైరల్ అవుతుంది .

ఆ సినిమా మరేదో కాదు వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్ . అనన్య ఫిమేల్ లీడ్ పాత్రలో కనిపించారు. అయితే ఇది పూర్తిగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా . ఇందులో ఎలాంటి రొమాంటిక్ ..బోల్డ్ సీన్స్ ఉండనే ఉండవు. అప్పుడప్పుడే స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న రష్మిక మందన్నాకు నివేద థామస్ ప్లేస్ లో చేసే ఛాన్స్ వచ్చింది .

అయితే నివేదా థామస్ రోల్ ను ఆమె రిజెక్ట్ చేసింది . ఇలాంటి పాత్రలు చేస్తే గ్లామరస్ బ్యూటీగా ఇక ఇండస్ట్రీలో ఉండలేను ఏమో అని భయపడిన ఆమె ఈ పాత్రను పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్న కూడా రిజెక్ట్ చేసిందట . అయితే అప్పట్లో జనాలు మాత్రం రష్మిక ఈ పాత్రను లిప్ లాక్ సీన్స్ ,బోల్డ్ సీన్స్ లేవనే నటించలేదు అని ..అలాంటి హీరోయిన్ కి ఇంత పద్ధతి రోల్ ఇస్తే ఎలా చేస్తుందని వ్యంగ్యంగా కౌంటర్స్ వేశారు. ప్రజెంట్ ఇదే న్యూస్ మరోసారి వైరల్ అవుతుంది..!!