అమ్మ బాబోయ్…. తొలి సినిమాతోనే ఐదు నేషనల్ అవార్డులు అందుకున్న చిన్నారి… ఇదెక్కడ లక్ రా బాబు…!!

బేబీ ఇయల్ గురించి మనందరికీ తెలిసిందే. ” సూరారై పోట్లు ” మూవీలో ఏడేళ్లకే సినిమా చేసిన ఈ చిన్నారి… ఐదు నేషనల్ అవార్డులను దక్కించుకుంది. తొలి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఓ రికార్డును క్రియేట్ చేసుకుంది. సూర్య, అప‌ర్ణా బాలమురళి నటించిన ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బేబీ.. తాజాగా రిలీజ్ అయిన..” లియో ” సినిమాలోను కీలక పాత్ర పోషించింది.

ఇక విజయ్ హీరోగా త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ క్రమంలోనే వీరిద్దరి కూతురుగా నటించిన ఈ చిన్నారి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. ఈ చిన్నారి అడుగుపెడితే తప్పకుండా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే అంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు.

ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు వస్తున్నారు, పోతున్నారు.. కానీ ఇయల్ మాత్రం ఇక్కడే పాతుకు పోతుంది అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఈ పాప పెద్దయ్యాక తప్పకుండా ఓ స్టార్ హీరోయిన్ అయిపోతుంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ చిన్నారి తమిళ్ యాంకర్ అర్జున‌న్ కూతురు. ఈయన ” టిక్ టిక్ టిక్ , ఓ మై ఘౌస్ట్ ” సినిమాలలో కామిక్ క్యారెక్టర్స్ లో ఫేమ్ సంపాదించాడు.