వామ్మో… బన్నీ నటించిన ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో అనసూయ హీరోయిన్గా ఛాన్స్ మిస్ చేసుకుందా… దరిద్రమంతా ఈమె చుట్టూనే తిరుగుతున్నట్టు ఉందిగా…!!

అనసూయ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం సినిమా రంగంలో దూసుకుపోతుంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటుంది. ఈ మధ్యకాలంలో ఈమె నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తతో వైరల్ అవుతూనే ఉంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ” పుష్ప ” మూవీలో సునీల్ భార్యగా దాక్షాయిని పాత్రలో నటించి ప్రేక్షకులని మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది. అనసూయ మాట్లాడుతూ..” పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది ‘ సినిమాలో ఒక సాంగ్ లో నటించమని త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చారు. కానీ నేను దాన్ని రిజెక్ట్ చేశాను. అలాగే బన్నీ హీరోగా నటించిన ” ఆర్య-2 ” సినిమాలో కూడా నాకు హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ నేను నటించలేనని చెప్పాను.

దీంతో నా స్థానంలో శ్రద్ధాదాస్ ను ఎంచుకున్నారు. ఆ సమయంలో నేను నా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాను. అందువల్లే రిజెక్ట్ చేశాను ” అంటూ చెప్పుకొచ్చింది. ఈమె వ్యాఖ్యలు పై స్పందిస్తున్న ప్రేక్షకులు…” బన్నీ పక్కన హీరోయిన్గా చేసే అదృష్టం నీకు లేదు. నువ్వు గ్లామర్ షోస్ కు మాత్రమే పనికొస్తావు. అల్లు అర్జున్ పక్కన చేయాలంటే ఒక స్థాయి ఉండాలి.. కుక్కకి ఏం తెలుసు నాగలోకం విలువ…” అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.