వరుణ్-లావణ్యలకి అలాంటి గిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. కెవ్వు కేక అంతే..!!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది . ఇటలీలో వీళ్ల పెళ్లి జరిగిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి . చాలా కాలం తర్వాత మెగా ఫ్యామిలీ మళ్ళి ఒకచోట కనిపించడంతో మెగా అభిమానులు ఈ పిక్స్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు .

కాగా ఇటలీలో జరుపుకున్న వరుణ్ లావణ్యలకు టాలీవుడ్ సినీ ప్రముఖులు మంచి మంచి బహుమతులు పంపించినట్లు సమాచారం అందుతుంది .మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వరుణ్ లావణ్య త్రిపాఠిలకు రెండు కోట్ల విలువ చేసే డైమండ్ సెట్ ని గిఫ్ట్ గా అందజేశారట . కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. వరుణ్ లావణ్యలకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ కారును కోటి రూపాయలు ఖర్చు చేసి గిఫ్ట్ చేసినట్లు తెలుస్తుంది .

వరుణ్ కి లావణ్య కి కార్లు అంటే మహా పిచ్చట. అందుకే వాళ్లకి ఇష్టమైన కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారట. బహుమతులు ఎంత కాస్ట్లీ వి విచ్చినా .. తమకి ఇష్టమైనవి బహుమతిగా వస్తే ఆ కిక్కే వేరు అంటూ అదే పవన్ కళ్యాణ్ కి ఉన్న స్పెషల్ థింగ్ అంటూ ఈ వార్తని ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు..!!