అమ్మ దొంగ.. దేవరలో జాన్వీ లుక్ ఆ హిట్ సినిమాకి కాపి నా..? కొరటాల కాదు.. కాపీ రాజానే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . రీసెంట్ గానే కొరటాల శివ .. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా నుంచి జాన్వి కపూర్ లుక్ ను రిలీజ్ చేశారు . నిజానికి జాన్వి కపూర్ ఈ సినిమాలో నటిస్తుందని చెప్పడానికే వాళ్ళు ఒక ఫస్ట్ ట్రెడిషనల్ లుక్ ను రిలీజ్ చేశారు . అయితే రీసెంట్గా మరో లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే ఆ లుక్ చాలా వైరల్ అవుతుంది.

లంగా వోణీలో చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది జాన్వి కపూర్ . అయితే ఈ లుక్ ఎవరు చూసినా సరే వెంటనే ఆమెను ఎక్కడో చూసినట్లుందే అంటూ అనుకోక తప్పదు. ఎస్ రంగస్థలం సినిమాలో సమంత ఇదే లుక్ లో కనిపిస్తుంది . అంతేకాదు రష్మిక మందన్నా కూడా పుష్ప సినిమాలో ఇదే లుక్ లో కనిపిస్తుంది . దీనితో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి .

అయితే కొరటాల శివ ఆ పిక్స్ నుంచి ఆమె లుక్ ను తీసుకున్నారా ..? అంటూ ట్రోల్ చేస్తున్నారు . కొరటాల కాదు కాపీ రాజా అంటూ కొందరు వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు . అయితే ఎన్టీఆర్ దేవర సినిమా స్టోరీ – రంగస్థలం , పుష్ప సినిమా స్టోరీ వేరని కేవలం లుక్స్ ఒకటైనంత మాత్రాన ఈ రేంజ్ లో ట్రోలింగ్ చేయకూడదు అంటూ నందమూరి ఫ్యాన్స్ కొరటాలకు సపోర్ట్ చేస్తున్నారు..!!