మద్యానికి బానిసై.. కెరియర్ని నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. గతంలో హీరోయిన్స్ గా నటించిన వారు ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మరింత పాపులారిటీ అందుకున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న తరువాత కొన్ని కారణాల చేత ఫెడౌట్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ రచన కూడా ఒకరు.

బెంగాలి సినిమాలలో హీరోయిన్గా నటించిన రచన డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన నిన్ను ప్రేమిస్తున్నానని అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత చిరంజీవి, బాలయ్య వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈమె గుర్తింపు బాగానే సంపాదించింది. చిరంజీవితో బావగారు బాగున్నారా..బాలయ్యతో సుల్తాన్ వంటి సినిమాలలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది. అలా సినిమాలు చేస్తున్న క్రమంలోనే తన భర్తతో తనకు ఏర్పడిన కొన్ని సమస్యల వల్ల భర్త నుండి కూడా విడిపోవడం జరిగింది.

ఇలా డిస్టర్బ్ అయిన రచన మద్యానికి ఎక్కువగా అలవాటు పడిపోయి షూటింగ్లకు తాగి వెళ్తూ ఉండేదట.. అంతేకాకుండా అందరి ముందు సిగరెట్లు తాగుతూ ఉండడం వల్ల ఈమె బిహేవియర్ కరెక్ట్ గా లేదని ఉద్దేశంతోనే ఈమెను సినిమాలలో చాలా మంది తీసుకోలేదట. అలా ఒక్కసారిగా రచన సినీ కెరియర్ దూరం కావాల్సి వచ్చింది. వాస్తవానికి ఈమె ఎన్నో మంచి సినిమాలలో నటించినప్పటికీ మరిన్ని అవకాశాలు వస్తున్న సమయంలో చేజేతులారా ఈమె కెరీయర్ని నాశనం చేసుకుంది. ఇలా రచననే కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు.