స్పైసి ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. మీరు డేంజర్ లో ఉన్నట్టే..

ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్‌లో బయట ఫుడ్ ను ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంట్లో తయారు చేసుకునే సమయం లేక బయట ఫుడ్ లో వాడే మసాలాలు, స్పైసి నెస్ కి అలవాటు పడి చాలామంది బయట ఆహారాన్ని ఆ కారం మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతున్నారు. దేశంలో మిర్చి ఘాటు లేని ఆహారం అసలు ఎవరికీ రుచించదు. పప్పు నుంచి మొదలుకొని అన్ని రకాల కూరల్లోనూ కారం వాడాల్సిందే. మిరపకాయల కారం తో అన్ని రకాల వంటలను చేసుకుని తినడానికి ఎంతగానో ఆశ‌క్తి చూపురున్నారు.

ఏది ఉన్న లేకపోయినా వంటగదిలో కారం మాత్రం ఉండాలి. మిరపకాయలను బట్టి పొడిని అవసరానికి తగ్గట్టుగా ఉపయోగిస్తారు. అయితే కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెప్తున్నారు. స్పైసి ఫుడ్ లో ఎక్కువ ఉప్పు, మసాలాలు కూడా వాడుతూ ఉంటారు. దీని కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మీరు ఇప్పటికే హై బీపీ తో బాధపడుతున్న వారైతే ఇలాంటి స్పైసీ ఫుడ్లను మానుకోవడమే మంచిది. లేదంటే మీరే ప్రమాదంలో పడతారు. కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం లోని తేమ తగ్గి, చ‌ర్మం పొడిబారిపోతుంది.

చర్మ సమస్యలు వస్తాయి. మసాలా ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. దీనికి కారణం వాటిలో ఎక్కువ క్యాలరీలు ఉండడమే. ఈ ఆహారం తిన్న తర్వాత కూడా మీకు బాగా ఆకలి అనిపిస్తుంది. దీంతో బరువు మరింతగా పెరుగుతారు. అంతేకాదు అధికంగా మసాలాలు, కారాలు తినేవారికి పైల్స్ వ్యాధులు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీంతో పాటు మిర్చి ఎక్కువ ఉపయోగించ‌టం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మసాలాలు తగ్గించుకోవడం బెస్ట్ అని వైద్యుల సలహా.