కన్నప్ప సినిమా నుంచి మంచు విష్ణు బర్తడే స్పెషల్.. పోస్టర్ వైరల్..!!

హీరో మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు మొదటిసారి రగిలే గుండెలు అనే సినిమాతో చైల్డ్ యాక్టర్ గా పరిచయమయ్యారు.. ఆ తర్వాత 2003లో వచ్చిన విష్ణు అనే సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో అవార్డు కూడా అందుకున్న విష్ణు బ్యాక్ టూ బ్యాక్ వరుసగా సినిమాలు చేశారు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలను తెరకెక్కించి ఆకట్టుకున్నారు. అలాగే మోహన్ బాబు నిర్మించిన మోహన్ బాబు కార్పొరేషన్ కి కూడా విష్ణు CEO కూడా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ రోజున మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభిమానులు సైతం సినీ ప్రముఖుల సైతం విషెస్ తెలియజేస్తున్నారు. మంచు విష్ణు చివరగా నటించిన చిత్రం జిన్నా కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా తెరకెక్కించిన ఈ సినిమా టాక్ పరంగా బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా కన్నప్ప అనే ఒక సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాను కూడా మోహన్ బాబు భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తూ ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పలు రకాల విదేశాలలో కూడా జరుగుతోంది.

కన్నప్ప చిత్రంలో చాలామంది సెలబ్రిటీలు కూడా నటిస్తూ ఉన్నారు. తాజాగా కన్నప్ప సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేరకు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ను విడుదల చేశారు చిత్ర బృందం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా అన్ని భాషలలో విడుదల చేస్తున్నారు. కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుని పాత్రలో కనిపించబోతున్నారని నయనతార పార్వతి దేవిగా కనిపించబోతుందని సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించి పోస్టర్ వైరల్ గా మారుతున్నది.