కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాకి కష్టాలు తప్పలా లేదే..?

నందమూరి కళ్యాణ్ రామ్ గత ఏడాది బింభిసార సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఆ తర్వాత తాను నటించిన ఆమీగోష్ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. దీంతో కళ్యాణ్ రామ్ ఆశలన్నీ కూడా డెవిల్ సినిమా పైన పెట్టుకొని నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ కొన్ని వివాదాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.

ముఖ్యంగా పోస్టర్ తో ఉన్న డైరెక్టర్ పేరును చిత్ర బృందం తొలగించి మరొకసారి ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదం పైన ఇప్పటికీ సరైన క్లారిటీ రాలేదు.. మొదట డైరెక్టర్ మేడారం దర్శకత్వం వహించగా ఈ సినిమా విషయంలో కొన్ని విభేదాలు కారణంగా చిత్ర బృందం అతడి పేరును తొలగించి అభిషేక్ నాయర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లుగా ప్రకటించుకున్నారు. అయితే ఈ వివాదం విషయంలో డైరెక్టర్ కూడా హర్ట్ అయి సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ గా పోస్టులు వేయడం జరిగింది. అయితే ఈ విషయం పైన ఎవరు కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు.

అయితే హీరో కళ్యాణ్ రామ్ కూడా ఈ విషయంలో కాస్త మౌనంగా ఉండడంతో ఎవరికి అర్థం కావడం లేదు ఇంతకీ గొడవ ఒక కొలిక్కి రాకపోవడంతో బాధపడ్డ నవీన్ తాను కూడా చట్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా సినిమాకు మరొక చిక్కు రావడం జరుగుతోంది. టాక్ పరంగా థియేటర్ బిజినెస్ విషయంలో నిర్మాతలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.సినిమా షూటింగ్ ఇంకా పూర్తి చేయవలసి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభించారు.. ముఖ్యంగా ఈ సినిమా చుట్టూ ఉన్న వివాదాల కారణంగా బజ్ కి ఈ సినిమా కు అడ్డంకిగా మారుతోంది. మరి హీరో కళ్యాణ్ రామ్ ఈ విషయాన్ని సాల్వ్ చేయకుంటే ఈ సినిమా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.