ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న మాధవన్.. కట్ చేస్తే..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతూ మంచి సక్సెస్ అయినటువంటి హీరోలలో మాధవన్ కూడా ఒకరు. తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు .అయితే ఈ మధ్య తను నటిస్తున్న సినిమాలు చాలా తక్కువగానే విడుదలవుతున్నాయి.. ఈయన చివరిగా నంబి నారాయణ జీవిత కథ ఆధారంగా ఒక సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా అందులో నటించడం జరిగింది. తాజాగా ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఆ వెబ్ సిరీసి ద రైల్వే మెన్.. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొన్న మాధవ పలు విషయాలను తెలిపారు.. ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటి జూహి చావ్లా కూడా నటించింది. అయితే ఈమె గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. ఈ వెబ్ సిరీస్ లో తనకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇందులో ఆమె భాగమయ్యిందని తెలియజేయడం జరిగింది.

అయితే 1988లో నటించిన ఖయామత్ సే ఖయామత్ టక్ సినిమా చూసీ ఫిదా అయ్యానని తెలియజేశారు. తక్షణమే తనని వివాహం చేసుకోవాలనుకున్నానని కానీ ఈ విషయం మాత్రం తన తల్లిని అడగక తన తల్లి నవ్వుతూ వెళ్లిపోయిందని తెలియజేశారు మాధవన్. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం జూహీ తన కెరీర్ని ప్రారంభించిన సమయంలో మాధవన్ ఇంకా కెరీర్నే ప్రారంభించలేదంటూ ఆమెను ఎలా వివాహం చేసుకుంటారంటూ విడ్డూరంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.