ఆ విల్లన్ తో ప్రేమలో మునికి తేలుతున్న తెలుగు హీరోయిన్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ హీరోయిన్గా కొన్ని సినిమాలలో నటించి ఆ తర్వాత ఫేడ్ అవుట్ ఆయన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో విమలా రామన్ కూడా ఒకరు.. క్లాసికల్ డాన్సర్ అయిన ఈమె ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగి ఇండియాలో సినిమాల మీద ఆసక్తితో ఇక్కడే ఉండిపోయింది. 2009లో ఇండస్ట్రీలోకి మొదటిసారి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎలా గోలాగా కొన్నేళ్లపాటు బాగానే నెట్టుకొచ్చింది. హీరోయిన్గా చేసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించింది.

అయితే తాజాగా గాండీవ దారి అర్జున, రుద్రాంగి తదితర చిత్రాలలో నటించడం జరిగింది విమలా రామన్. ప్రస్తుతం ఈమె వయసు 41 ఏళ్లు అయినప్పటికీ కూడా ఇంకా వివాహం చేసుకోలేదు.. కానీ విలన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు వినయ్ రామ్ తో కలిసి గత కొన్నేళ్లుగా ఏమి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వీరిద్దరూ కలిసి దిగినటువంటి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది.

విమలా రామన్ వినయ్ రామ్ తో కలిసి ఇన్స్టాగ్రామ్ లో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసి తమ రిలేషన్ ని కన్ఫర్మ్ చేసిందని తెలుస్తోంది. సినిమాలు లేకపోయినా ఏదో ఒక విషయంలో మాత్రం వైరల్ గా మారుతూనే ఉంటుంది విమలా రామన్. మరి ప్రియుడితో పెళ్లి విషయంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి ఈ అమ్మడు తెలుగులో పరిచయమైన సమయంలో స్టార్ హీరోయిన్ గా అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్న కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక తన కెరియర్ పడిపోయింది.