అక్కినేని నాగార్జున ఓ సినిమాకు దర్శకత్వం వహించాడని తెలుసా..? ఆ మూవీ రిజల్ట్ ఇదే..?!

అక్కినేని నాగేశ్వరరావు నటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగార్జున. తండ్రికి తగ్గ తనయుడుగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక టాలీవుడ్ మన్మధుడుగా క్రేజ్ సంపాదించుకున్న‌ నాగార్జున.. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్‌గా కనిపిస్తూ కుర్ర‌ హీరోలకు పోటీగా లుక్స్‌ మెయింటైన్ చేస్తున్నాడు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలను ఎక్కువగా నటించే వారిలో నాగార్జున మొదటి వ్యక్తి . అన్ని జాన‌ర్లు నటిస్తూ సక్సెస్ అందుకున్న నాగార్జున తెలుగు ఆడియోస్ తో పాటు.. హిందీ, తమిళ్ ఆడియోస్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు.

ఒక మాటలో చెప్పాలంటే అప్పట్లో పాన్ పర్ఫెక్ట్ పాన్ ఇండియా హీరో అంటే నాగార్జున. ఇక నాగార్జున కేవలం నటుడు గానే కాక నిర్మాతగా, బిజినెస్ మ్యాన్‌గా అన్ని విధాలుగా సక్సెస్ అందుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం నాగార్జునకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగార్జున హీరోగా, ప్రొడ్యూసర్ గానే కాదు ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఆ సినిమా రిజ‌ల్ట్ ఏలాఉందో ఓ సారి చూద్దాం. నాగార్జున గతంలో సంతోషం అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు దర్శకుడిగా దశరథ్ వ్యవహరించాడు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో తర్వాత వచ్చిన మూవీ గ్రీకువీరుడు. ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను రూపొందించిన తర్వాత దశరథ్ ఈ సినిమాను పట్టాలెక్కించారు.

ఇక నాగార్జున – దశరథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ భారీ అంచ‌నాల‌తో రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా షూటింగ్ టైంలో దశరథ కి అనారోగ్యం ఏర్పడడంతో షూటింగ్ మధ్యలో ఆగిపోతే నయనతార తో పాటు మరింత మంది స్టార్ సెలబ్రిటీలకు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది.. 2 నెలల పాటు షూటింగ్ ఆపేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతో.. నాగార్జుననే చాలా వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాడట. డైరెక్టర్గా వ్యవహరించి ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్లాడు. అయితే ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ సినిమాకు దర్శకత్వం వహించి నాగార్జుననే సినిమా ప్లాప్ అవ్వడానికి కారణమయ్యాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జ‌నాలు.