పుష్ప2 ఎన్టీఆర్ హీరోయిన్ తో చిందులు..అలా నరుకొచ్చావ సుక్కు..నువ్వు కేక..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆయన క్రేజ్..రేంజ్ అన్నీ మారిపోయాయి . ఇప్పుడు సుకుమార్ అన్న పేరు చెప్తే చాలు చాలా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయి . కాగా సుకుమార్ తన సినిమాలో ఐటమ్ సాంగ్స్ విషయంలో ఎంత కేర్ఫుల్ గా ఉంటాడో మనకు తెలిసిందే.

మరీ ముఖ్యంగా పుష్ప సినిమాలో ఉ అంటావా మామ సాంగ్ తర్వాత పుష్ప 2 లో ఎలాంటి సాంగ్ ఉండబోతుంది అని  ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జాన్ జిగిడి దోస్త్ అయిన హీరోయిన్ అలియాభట్ ఐటమ్ సాంగ్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు టాలీవుడ్ బ్యూటీస్ పై ఫోకస్ చేసిన సుకుమార్ .. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్స్ ని రంగంలోకి దించాలని చూస్తున్నాడట .

అంతేకాదు అలియా భట్ సైతం బన్నీ తో నటించాలి అని ఎప్పటినుంచో అనుకుంటుంది . అందుకే ఈ సాంగ్లో చిందులు వేయడానికి యాక్సెప్ట్ చేసిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. కాగా దేవర సినిమాలో మొదటగా హీరోయిన్గా అలియా భట్ ని  అనుకున్న విషయం అందరికీ తెలిసిందే .ఆమె కొన్ని కారణాల చేత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకునింది..!