వామ్మో..ఏంటి ఇది..అనసూయ కి అది అంటే అంత ఇష్టమా..? మరో సమంతలా తయారైపోయిందిగా..!!

అనసూయ ఈ మధ్యకాలంలో ఈ పేరు చాలా చాలా వైరల్ అవుతుంది . స్టార్ హీరోయిన్ కి కూడా ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదనే చెప్పాలి . ముఖ్యంగా అనసూయ అస్సలు భయపడదు నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది . అది ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ..మొన్నటికి మొన్న రాజకీయ నేత తిట్టిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంత బోల్డ్ గా స్పందించిందో మనం చూసాం. ఇలా నిరంతరం సోషల్ మీడియాలో హాట్ గా ట్రెండ్ అయ్యే అనసూయ రీసెంట్గా ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ సెషన్ లో ప్రశ్నలు అడిగినప్పుడు ఇచ్చిన ఆన్సర్స్ వైరల్ అవుతున్నాయి .

బుల్లితెర వెండితెర రెండిట్లో ఏది ఇంపార్టెంట్ ..? అని ప్రశ్నించగా ” పుట్టినిల్లు మెట్టినిల్లు” అంటూ టఫ్ ఆన్సర్ ఇచ్చింది . అంతే కాదు బికినీ అంటే ..? ఇష్టమా శారీ అంటే ఇష్టమా..? అన్న ప్రశ్నకు..” బయట ఎక్కడైనా బికినీ వేసుకుంటా …కానీ నా ఫేవరెట్ మాత్రం శారీ.. చీరలో బీచ్ కి వెళ్ళినప్పుడు కంఫర్టబుల్గా ఉండదుగా అందుకే పరిస్థితికి తగ్గట్టు వేసుకుంటాను “అంటూ ఆన్సర్ ఇచ్చింది .

అంతేకాదు మీకు జిమ్ ఇష్టమా..? లేక ఫుడ్ ఇష్టమా..? అన్న ప్రశ్న ఎదురైనప్పుడు అనసూయ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది . “కచ్చితంగా ఫుడ్ .. ఫుడ్ లేకుండా జిమ్ కి వెళ్తే పడిపోతాను ..ఫుడ్ బాగా తిని జిమ్ కి వెళ్తే వర్కౌట్ చేయగలను నా బాడీని ఫిట్గా ఉంచుకోగలను. అందరూ అంటుంటారు బతకడం కోసం తింటారు అని కానీ నేను మాత్రం బతుకున్నదే తిండి కోసం ..తిండి లేకపోతే నేను ఉండలేను” అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు గతంలో ఓ ఇంటర్వ్యూలో సమంత కూడా ఇదే విధంగా ఆన్సర్ చేసింది .దీనితో సోషల్ మీడియాలో సమంత అనసూయ టేస్ట్ ఒకటే అని ఇండస్ట్రీలో మరో సమంత లా అనసూయ మారిపోబోతుంది అంటూ ఫన్నీగా కౌంటర్స్ వేస్తున్నారు.