ఆ స్టార్ హీరో పై అల్లు అరవింద్ కాంట్రివర్షియల్ కామెంట్స్…” నీ కొడుకు ఎవరికి తెలుసుని ” అంటూ రిటర్న్ రిప్లై…!!

” కేజీఎఫ్ ” హీరో యశ్ మనందరికీ సుపరిచితమే. తాజాగా ఈయన పై కాంట్రివర్షల్ కామెంట్స్ చేశాడు అల్లు అరవింద్. ” కోట బొమ్మాళి ” టీజర్ లాంచ్ లో పాల్గొన్న అల్లు అరవింద్.. కంటిన్యూయస్ గా సినిమాలు నిర్మించకపోవడానికి కారణాలు చెప్పడంతో పాటు.. సినిమా బడ్జెట్ గురించి కూడా చెప్పారు. హీరోలు తీసుకుంటున్న రెమ్యునరేషన్ వల్లే బడ్జెట్ పెరిగిపోతుందన్న అల్లు అరవింద్.. పెద్దగా తీసిన సినిమాలలో కథానాయకులు ఉంటున్నారన్నాడు.

ఎగ్జాంపుల్ ” కేజీఎఫ్ ” రిచ్ నెస్ గురించి మాట్లాడిన అల్లు అరవింద్.. అలా తీయడం వల్లే రీచ్ ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ముందు హీరో యశ్ గురించి ఎంతమందికి తెలుసని విషయాన్ని ప్రస్తావించాడు. అయితే ఈ కామెంట్స్ ను నెగిటివ్ గా తీసుకున్నారు యశ్ ఫ్యాన్స్.

తమ హీరోకు ” కేజీఎఫ్ ” కు ముందు ఐడెంటిటీ లేదంటున్న అల్లు అరవింద్… తన కొడుక్కి ఎలా వచ్చిందో చెప్పాలని కోరారు. ఒక హీరో గురించి మాట్లాడేటప్పుడు ఆచి, తూచి మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడితే సహించేదే లేదు. అనుకుంటే మీ అబ్బాయిని అనుకోండి. అంతేకానీ..యశ్ గురించి మాట్లాడితే అస్సలు బాగోదు.. అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం అల్లు అరవింద్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.