“త్వరలోనే బ్యాడ్ న్యూస్ వింటారు”..అభిమానులను టెన్షన్ పెట్టిస్తున్న సమంత కామెంట్స్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ మయోసైటీస్ అనే వ్యాధి కారణంగా బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ జబ్బుకు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆమె అన్ని దేశాలు చుట్టేస్తుంది . అంతే కాదు రకరకాల ట్రీట్మెంట్లను కూడా తీసుకుంటుంది . కాగా రీసెంట్గా సమంత బజార్ అనే ప్రముఖ మ్యాగజైన్ కు ఫోటోషూట్ చేసింది . ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన లైఫ్ కి సంబంధించిన డీటెయిల్స్ ను క్లియర్ గా చెప్పింది .

“పెళ్లి అనే దశ ప్రతి ఒక్కరు లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని ..నా లైఫ్ లో అది ముగిసిపోయింది “అంటూ ఇక పెళ్లి చేసుకునేదే లేదు అని పరోక్షకంగా హింట్ ఇచ్చేసింది . అంతేకాదు ప్రెసెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అని.. చాలా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా చెప్పుకొచ్చింది . అంతేకాదు సమంత సినిమాల గురించిన మాట్లాడిన మాటలు ఇప్పుడు అభిమానులకు కొత్త టెన్షన్ పెడుతున్నాయి .

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సమంతకి ఇక సినిమాలు చేసే ఉద్దేశం లేదట . ఆమె పూర్తిగా తన ఆరోగ్యం కుదుటపడ్డాక బిజినెస్ రంగం వైపు వెళ్లాలనుకుంటుందట . సినిమాలకు కమిట్ అయ్యి ఆరోగ్యం బాగోలేక మేకర్స్ ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు అని సమంత భావిస్తుందట . ఇలా చూసుకుంటే త్వరలోనే సమంత అభిమానులకు బ్యాడ్ న్యూస్ వినక తప్పదు . ఆమె ఇక సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసే ఛాన్సే లేదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . దీంతో సమంత ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు..!!