ఎన్టీఆర్‌ పిల్లలని చూశారా ఎంత క్యూట్‌ గా ఉన్నారో..దీపావళి ఫ్యామిలీ పిక్‌ వైరల్‌..!!

దేశవ్యాప్తంగా దివాళి పండుగ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు జనాలు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు ఎప్పుడు బిజీ షెడ్యూల్ తో గడిపేస్తూ ఉంటారు . కాగా ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు . అలాంటి పిక్స్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటారు .

ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండే తారక్..రీసెంట్గా దీపావళి కి ఫ్యామిలీతో కలిసి దిగిన పిక్ ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ పిక్ లో ఫ్యామిలీ మొత్తం చాలా ట్రెడిషనల్ లుక్స్ లో ఆకట్టుకుంది . మరీ ముఖ్యంగా లక్ష్మీ ప్రణతి సింపుల్ శారీ తో అభిమానులను కట్టిపడేసింది.  తారక్ ని ఆ స్టైల్ ఆ ట్రెడిషనల్ లుక్ లో చూస్తుంటే చాలా బాగుంది  అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు .

అయితే ఈ ఫోటోకి మొత్తం హైలెట్ అయింది అభయ్ రామ్ – భార్గవ్ రామ్. చాలా క్యూట్గా చాలా అమాయకంగా ఈ ఫొటోస్ లో కనిపించారు . అంతేకాదు చిన్నోడి ఫోటో చూసిన జనాలు అచ్చం నువ్వు మీ నాన్న లాగానే ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో తారక్ దీపావళి ఫ్యామిలీ పిక్ వైరల్ గా మారింది..!!