డూప్ లేకుండా.. డైరెక్ట్ గా రంగంలోకి దిగనున్న ఎన్టీఆర్… ఏ సినిమాలోనో తెలుసా…!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు తారక్. ఇక తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ ” దేవర “. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా అవ్వనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ , తారక్ కాంబినేషన్లో సన్నివేశాల చిత్రీకరణ ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కు కంప్లీట్ కానుంది.

అనంతరం ” వార్ 2 ” మూవీ సెర్చ్ లో జాయిన్ కానున్నాడు తారక్. హృతిక్ రోషన్, దీపిక పదుకొణే కాంబోలో ఇప్పటికే ఈ మూవీ తొలి షెడ్యూల్ స్పెయిన్ లో పూర్తి కాగా.. జనవరి నుంచి ఈ మూవీ పనుల్లో బిజీ అవ్వను నాడు తారక్. ఇక ఈ మూవీ యాక్షన్ సీక్వెన్స్ ను హృతిక్.. దీపిక బాడీ డూప్స్ తో కంప్లీట్ చేయగా… తన యాక్షన్ స్టంట్స్ మాత్రం డూప్ లేకుండా ఎన్టీఆర్ చేయనున్నాడట.

గతంలో ” ఆర్ఆర్ఆర్” లో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి యాక్షన్ కొరియోగ్రఫీలో పాల్గొనగా ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయనున్నాడు. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్న ఆయన, హృతిక్ తో పోటీ పడనున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.