నొప్పుల మాత్రలను అతిగా ఉపయోగిస్తున్నారా.. అయితే ఒకసారి విటిని తెలుసుకోండి..!!

ఈ మధ్యకాలంలోని ఆహారం వల్ల చాలామంది త్వరగానే నొప్పుల బారిన పడుతూ ఉన్నారు. చిన్న వయసులోనే సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉండడంతో చాలామంది వాటిని ఉపయోగించి నొప్పులను మటుమాయం చేసుకుంటున్నారు. కానీ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను ఎక్కువగా ఉపయోగించడం చాలా ప్రమాదమని వైద్యులు సైతం తెలియజేస్తున్నారు.. ఈ పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు నొప్పులను మాత్రమే తగ్గించగలవు కానీ పూర్తి చికిత్సను అందించలేవు

చాలామంది నొప్పి గురించి తగ్గిపోగానే వాటిని మర్చిపోతూ ఉంటారు పదేపదే ఆ నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. అలా కాకుండా ఎక్కువగా నొప్పుల మాత్రలను ఇష్టానుసారంగా ఉపయోగిస్తే వ్యాధి ముదిరిపోవడంతో పాటు కిడ్నీలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ లోని తక్కువ మోతాదులు ఉపయోగించాలి శరీరంలో ఏ ప్రదేశంలో నైనా సరే దెబ్బ తగిలినప్పుడు ఆ ప్రదేశంలో నరాలు మెదడుకు పెయిన్ మెసేజ్ సిగ్నల్ ని సైతం పంపిస్తూ ఉంటాయి.

ఎక్కువగా నొప్పి మాత్రలను వేసుకుంటే దెబ్బ తగిలిన చోట లేకపోతే వెన్నుముక మెదడు ప్రదేశాలలో కచ్చితంగా ఏదో ఒక ప్రదేశంలో మొద్దుపరిచే విధంగా మారుతాయట. దీంతో నొప్పి అనుభవానికి రాకుండా పోతుంది.. అంతేకాకుండా పెయిన్ కిల్లర్స్ వాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాత వాడడమే మంచిదని వైద్యుల సైతం తెలియజేస్తున్నారు. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇచ్చింది కాలేయం ఔషధాలలోకి ప్రమాదకరమైన పదార్థాలను నిల్వ చేస్తుందట.దీని ద్వారా కాలేయ వ్యాధి కూడా రావచ్చు.పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉన్నానే ఎక్కువగా ఉపయోగించడం వల్ల అందులో ఉండే పొడి లేదా ఇంజక్షన్ రూపంలో తీసుకున్న ఈ ఔషధం నేరుగా రక్త ప్రవాహంలో ప్రవేశించి గుండెపైన ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా ఈ టాబ్లెట్లు తరచూ తినడం వల్ల పొట్ట పేగు కు సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతాయట.