ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నాగబాబు తన కొడుకు పెళ్లిలో తప్పు చేశాడా ..? అంటే ఎస్ అనే సమాధానమే వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వార్తను తెగ ట్రోల్ చేస్తున్నారు మెగా హేటర్స్. మనకు తెలిసిందే మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకున్నారు . ఆమెకు నుదుట బొట్టు పెట్టి ఆమె మెడలో మూడు ముళ్ళు వేశారు .
దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పిక్స్ లో మెగా ఫ్యామిలీ మొత్తం ఒక ఫోటో దిగింది . అయితే కళ్యాణ మండపంలో నాగబాబు చెప్పులు వేసుకుని ఉండడం ఇప్పుడు అభిమానులకి నచ్చడం లేదు . ఇది పెద్ద అరిష్టంగా భావిస్తున్నారు జనాలు . అంతేకాదు సొంత కొడుకు పెళ్లి లో ఇలా తప్పు ఎలా చేశావు నాగబాబు అంటూ ప్రశ్నిస్తున్నారు .
అయితే నాగబాబు తెలియక అలా చేశారని దానిని ఇంత పెద్ద రాద్దంతం చేయడం న్యాయం కాదు అంటున్నారు మెగా అభిమానులు. అయితే పెళ్లి మండపాని మనం గుడిలా భావిస్తాం. అలాంటి గుడిలోకి నాగ బాబు చెప్పులు వేసుకుని రావడం తప్పు అంటున్నారు జనాలు..!!