ఒక్క ఫోన్ కాల్ తో 100 కోట్లు పోగొట్టుకున్న చంద్ర మోహన్.. ఆయన లైఫ్ లో ఎప్పటికి మర్చిపోలేని పీడకల ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా పేరు సంపాదించుకున్న చంద్రమోహన్ ..నేడు ఉదయం మరణించిన విషయం మనకు తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా బాధపడుతున్న ఆయన నేడు ఉదయం అపోలో హాస్పిటల్స్ లో 9:45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు . సినిమా ఇండస్ట్రీలో దాదాపు 975 పైగా సినిమాల్లో నటించి స్పెషల్ క్రేజీ స్థానాన్ని దక్కించుకున్న ఆయన ఇండస్ట్రీకి ఎన్నో మంచి మంచి హిట్ సినిమాలను అందించాడు .

అంతే కాదు చంద్రమోహన్ వ్యక్తిగతంగా కూడా చాలామంది జనాలకు హెల్ప్ చేశారు. కాగా అలాంటి మంచి మనిషిని ఫ్రెండ్షిప్ పేరుతో ఓ హీరో దారుణంగా చీట్ చేశాడు . ఆ విషయం స్వయానా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . గోపీచంద్ నటించిన ఆక్సిజన్ సినిమా ఆయన చివరచిత్రం. ఆ తర్వాత ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ..”సినిమా ఇండస్ట్రీలో నేను మోసపోయాను అని ..ఒకరు ఫ్రెండ్షిప్ పేరుతో నన్ను నిండా ముంచేసారని చెప్పుకొచ్చారు”.

“ఆయన కారణంగా సుమారు 100 కోట్లకు పైగానే లాస్ అయ్యాను” అంటూ కూడా చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. ఫ్రెండ్షిప్ పేరుతో ఆయనకు పెద్ద టోకరానే వేశాడు ఓ స్టార్ హీరో అంటూ అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి . ఆయనకు జాన్ జిగిడి అయిన ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నాను అని కాల్ చేసి చెప్పగానే చంద్రమోహన్ నమ్మి ఆయన దగ్గర ఉన్న డబ్బులు అప్పుగా ఇచ్చారట.

అంతేకాదు ఆ అప్పు తీర్చకపోగా ఆయన పేరు చెప్పుకొని జనాల చేత డబ్బులు వసూలు చేసి చంద్ర మోహన్ నే మీ దగ్గర అడిగి తీసుకోమన్నారు అంటూ వేరే హీరోల దగ్గర కూడా మనీ తీసుకొని ఆయన పేరును వాడుకున్నారట . చివరికి ఆ హీరోలు వచ్చి చంద్రమోహన్ కి చెప్పే వరకు ఆయన పేరు చెప్పి ఆయన ఫ్రెండ్ డబ్బులు తీసుకున్నాడు అనే విషయం కూడా ఆయనకు తెలియదట. దీంతో డబ్బులు ఇచ్చిన వాళ్లకు అన్యాయం జరగకూడదు అని చంద్రమోహన్ నే ఆ డబ్బులను వాళ్ళకి సరి చేశారట . ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా త్రెండ్ అయింది. అలా ఒక్క ఫోన్ కాల్ తో 100 కోట్లకు పైగానే పోగొట్టేసుకున్నాడు చంద్రమోహన్..!!