కృష్ణ-విజయ నిర్మల పెళ్లి కి చంద్రమోహన్‌ తో ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? ఘట్టమనేని ఫ్యామిలీ ఎప్పటికి తీర్చుకోలేని రుణం..!!

టాలీవుడ్ సీనియర్ నటుడుగా పేరు సంపాదించుకున్న చంద్రమోహన్ నేడు ఉదయం 9:45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు . గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు. కాగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ట్రీట్మెంట్ కు బాడీ సహకరించకపోవడంతో ఉదయం 9:45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు . ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అఫీషియల్ గా ప్రకటించారు . కాగా ఇదే సమయంలో ఇండస్ట్రీలో ఆయనకు సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

కాగా సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా చంద్రమోహన్ కు సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు అంటే మహా మహా ప్రాణం. ఈ విషయం ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కృష్ణ విజయనిర్మల పెళ్లి చేసింది కూడా ఆయనే . ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కృష్ణ విజయనిర్మల పెళ్లి జరగడానికి కారణం నేనే అంటూ అని చెప్పుకొచ్చారు చంద్ర మోహన్.

“కృష్ణ మేకప్ మాన్, విజయనిర్మల అసిస్టెంట్ ,నేను , మోహన్ కుమార్ అనే ఒక జర్నలిస్ట్ మేము మాత్రమే ఉండి తిరుపతిలో వాళ్ల పెళ్లి చేశామని ..వాళ్ళిద్దరిది ట్రూ లవ్ అని .. వాళ్ళిద్దరు అంటే నాకు ఎప్పుడూ అపారమైన గౌరవం అని చెప్పుకొచ్చారు . అంతేకాదు ఇండస్ట్రీలో వీళ్ల పెళ్లిని కొంతమంది అడ్డుకోవాలని చూశారని ..కానీ నేనే దగ్గరుండి తిరుపతిలో వాళ్ళ పెళ్లి ని జరిపించానని చెప్పుకొచ్చాడు “.

ఆల్రెడీ కృష్ణకి పెళ్లి అయిన విషయం తెలిసిందే . ఇందిరాదేవితో పెళ్లయింది పిల్లలు కూడా ఉన్నారు . ఆ టైంలో విజయనిర్మల తో కృష్ణ పెళ్లి చేసుకోవడానికి జనాలు కూడా తప్పుపట్టారు . అయితే అటువంటి టఫ్ సిచువేషన్ ని సైతం ఫేస్ చేసి వాళ్లకు మనోధైర్యం ఇవ్వడంతో పాటు వాళ్ళ పెళ్లిని తిరుపతిలో ఘనంగా జరిపించడంతో చంద్రమోహన్ పేరు అప్పట్లో వైరల్ గా మారింది . అంతేకాదు కృష్ణ కూడా ఎన్నోసార్లు నీ రుణం నేన్య్ తీర్చుకోలేనిది చంద్రమోహన్ అంటూ ఆయనతో చెప్పుకొచ్చారట..!