క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా నటించే టైంలో చంద్రమోహన్‌ను ఘోరంగా అవమానించిన ఓ స్టార్ హీరో.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఒక‌ప‌ట్టి స్టార్ హీరో చంద్రమోహన్ ఈ రోజు ఉద‌యం మ‌ర‌ణించారు. ఇక100కు పైగా తెలుగు సినిమాల్లో హీరోగా నటించిన ఆయన మొత్తం సినీ కెరియర్ లో 975 సినిమాలలో నటించాడు. ఐదున్న‌ర ద‌శాబ్ధాల చంద్రమోహన్ సినీ కెరీర్‌లో ఏ హీరోయిన్ ఆయన పక్కన నటిస్తే స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకుంటుందని పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకున్నారు. అందుకు తగ్గట్లుగానే చంద్రమోహన్ తో కలిసి నటించిన జయసుధ, జయప్రద, శ్రీదేవిలు స్టార్ హీరోయిన్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ఇంత మంచి పేరును సంపాదించుకున్న చంద్రమోహన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సమయంలో టాలీవుడ్‌కి చెందిన‌ ఓ యంగ్ హీరో అవమానించారట. ఈ విషయాన్ని స్వయంగా చంద్రమోహన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివరించాడు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి నటులలో సీనియర్ నటులపై గౌరవం ఉండట్లేదని. మా అప్పుడు మా సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వారి నుంచి మేము చాలా నేర్చుకున్నామని వారిని ఎప్పుడు గౌరవిస్తూ ఉండే వాళ్ళమని.. మాకంటే పెద్దవారు కనిపిస్తే వారికి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళమని కానీ ఇప్పుడు ఉన్న కొంతమంది యంగ్ హీరోస్ రెస్పెక్ట్ ఇవ్వకపోగా.. మేమే వారికి నమస్కారం బాబు అంటూ చెప్పాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు.

అయితే ఆ స్టార్ హీరోస్ పేర్లు చెప్పలేదు. ఇక‌ ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో ఆ హీరోతో సీన్ గురించి డిస్కస్ చేశాన‌ని. ఈ సన్నివేశం చాలా మంచిది మన ఇద్దరం కలిసి నటించేటప్పుడు ఈ విధంగా మీరు డైలాగ్స్ చెప్తే చాలా బాగుంటుంది అంటూ ఓ సజెషన్ ఇచ్చాన‌ని వివ‌రించాడు. కాగా ఆ యంగ్ హీరో అలాంటివన్నీ మీ కాలంలో వాళ్ళు చూసేవారు. ఇప్పుడు అలా కాదు ఈ కల్చర్ కి అలవాటు పడ్డారు జనం అంటూ చెప్పాడట. అలాగే పక్కకువెళ్ళి ఆ మూవీ డైరెక్టర్‌కి ఆయ‌న‌ పై కంప్లైంట్ ఇచ్చాడ‌ట. ఇలాంటి ఓల్డ్ క్యారెక్టర్ ఆర్టిస్టులను ఎందుకు తీసుకుంటారు.

ఆయన వచ్చి నాకు సజెషన్ ఇస్తున్నాడు. అలా కాదు ఇలా చెప్పండి అంటూ చెబుతున్నాడు అంటూ కంప్లైంట్ ఇచ్చాడట. ఆ డైరెక్టర్ చంద్రమోహన్ వద్దకు వెళ్లి సార్ మీరు ఆయనకు ఎటువంటి సజెషన్స్ ఇవ్వకండి.. ఆయన చాలా పెద్ద హీరో.. మీరు ఆయనకు సజెషన్ ఇస్తే ఇప్పుడు ఆయన నామీద ఫైర్ అవుతున్నారు. ఆయన నన్నే తీసేసేలా ఉన్నారు. ప్లీజ్ సార్ ఇంకెప్పుడు అలా చేయకండి అంటూ చెప్పాడ‌ట. దానికి చంద్రమోహన్ క్షమించండి ఈసారి మళ్లీ అలా చేయను.. ఏదో చిన్నవాడు కదా అతనికి మంచి గుర్తింపు వస్తుందని చెప్పాను.. అని చెప్పి వెళ్ళిపోయాడట. ఈ విషయాన్ని చంద్రమోహన్ చెప్పుకొచ్చాడు.