వధువు ట్రైలర్ తో భయపెట్టిస్తున్న ఆవికాగోర్..!!

మొదట బుల్లితెర పైన తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆవికాగోర్ మొదట చిన్నారి పెళ్లికూతురు ద్వారా బుల్లితెర పైన ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా మారి ఈ ముద్దుగుమ్మ వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే అవికా గోర్ మధ్యలో కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చిన మళ్ళీ ఆ తర్వాత రాజుగారి గది సీక్వెల్స్ లో నటించి మంచి క్రేజ్ అందుకుంది.

అలా మళ్లీ ఈ ముద్దుగుమ్మ అన్ని కూడా వెబ్ సిరీస్లలో నటిస్తే బిజీగా ఉన్నది. మధ్యలో నిర్మాతగా మారి సినిమాలను తెరకెక్కించిన అవన్నీ ప్లాప్ గా మిగిలాయి. దీంతో తనకు వచ్చిన అవకాశాన్నల్లా చేసుకుంటూ తన కెరీయర్ని ముందుకు నడిపిస్తోంది. ఇటీవల తాజాగా మాన్షన్ 24 అని వెబ్ సిరీస్ లో కూడా ఇమే కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. రీసెంట్గా వధువు అనే ఒక సరికొత్త వెబ్ కంటెంట్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇందుకు సంబంధించి ట్రైలర్ కొన్ని గంటల క్రితం విడుదల కావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 8వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమ్మింగ్ కాబోతోంది. ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఈ ట్రైలర్ కూడా చాలా థ్రిల్లింగ్ యాక్షన్ ఎమోషనల్ సస్పెన్స్ వంటి వాటితో కలిగి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా అవికా గోర్, నటుడు నందు ఇందులో నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆవికాగోర్ వివాహమైన తర్వాత ఆమెకు ఎదురయ్యే సంఘటన గురించి ఈ పెళ్లి వెనుక ఉన్న మర్డర్ల మిస్టరీ గురించి ఈ వెబ్ సిరీస్ లో తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతున్నది.