కసరత్తులతో దడ పుట్టిస్తున్న సమంత..!!

టాలీవుడ్ లో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నిరంతరం తమ అభిమానుల కోసం పలు వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమెకు మయోసైటిస్ వ్యాధితో చికిత్స పొందుతూ పలు రకాల సినిమాలలో నటిస్తూనే ఉంది. ఎక్కువగా జిమ్ వర్క్ అవుట్లతో ఇమే కష్టపడుతూ ఉంటుంది. తాజాగా తన శరీరాన్ని సాన పెడుతున్నట్లుగా కొన్ని చేస్తూ ఒక వీడియోని సైతం షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు.

అంతగా తన కసరత్తులతో సైతం దడ పుట్టించేలా చేస్తోంది సమంత. వాస్తవానికి మయోసైటీస్ తో ఇబ్బంది పడుతున్న సమంత వాటిని తగ్గించుకోవడం కోసం తన ఆరోగ్య సూత్రాలను సైతం పాటిస్తున్నది..సమయానికి తిండి నిద్ర శారీరక శ్రమ వీటికి అవసరమని.. ఇక ఇమ్యూనిటీ పవర్ కూడా అవసరమని వాటిని తిరిగి పొందేందుకు జిమ్ము లో చాలా కష్టపడుతోంది. వీల్ బేస్ పైన ఎక్సర్సైజులు చేస్తూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.

అక్కినేని హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఆ తర్వాత ఇద్దరు పిల్లలను దత్తకు తీసుకున్నారని ఇటీవల వార్తలు వినిపించాయి. సమంత ఒంటరిగా ఉన్నందువల్ల తాను ఇద్దరు పిల్లలని దత్తకు తీసుకొని పెంచాలనుకోని ఆలోచిస్తోందట. తన ఫౌండేషన్ ప్రత్యూష సపోర్టుకి నిధులు చేర్చడంతో పాటు ఒకేసారి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని తల్లి కావాలనుకుంటోందట అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాకుండా సమంత ను తన తల్లి మళ్ళీ పెళ్లి చేసుకోమని అడుగుతోందని దానికి సమంతా మాత్రం నో అన్నట్లుగా తెలియజేస్తున్నట్లు సమాచారం. మరి ఈ విషయం పైన సమంత క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Krésha (@kreshabajaj)