పవన్ కళ్యాణ్ తో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఈ మధ్యకాలంలో అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా రాజకీయాల వైపు వెళ్లడం వల్ల సినిమాల దృష్టి కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ దిగడానికి చాలామంది సెలబ్రిటీలు సైతం పోటీ పడుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ తో ఒక అందాల ముద్దుగుమ్మ ఫోటో స్టిల్ చూస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అయితే ఈ ఫొటోస్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సెట్లో తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

No photo description available.

తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు రకాల స్పెషల్ రోల్స్ లో, సాంగ్స్ లో కూడా కనిపించింది. అయితే పెద్దగా గుర్తింపు అయితే సంపాదించుకోలేదు..బిగ్ బాస్ -7 సీజన్ తో ఒక్కసారిగా మరింత పాపులారిటీ అయింది.

మహిళా కంటిస్టెంట్గా వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన ఈమె బుల్లితెర ఆడియన్స్ సైతం ఆకట్టుకుంటుంది. ఈమె ఎవరో కాదు అశ్విని శ్రీ.. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ బావి కాంబినేషన్లో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

No photo description available.

ఇందులో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే అమ్మాయిగా కనిపించింది. సిల్వర్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ తో ఎంత ఇష్టాన్ని చూపించిందో నిజజీవితంలో కూడా అంతకుమించి అభిమానం ఉందంటూ తెలియజేస్తోంది. బిగ్ బాస్ లోకి రాకముందు పలు చిత్రాలలో స్పెషల్ రోల్స్ లో అలరించిన అశ్వని శ్రీ.. అమీర్పేటలో బీటెక్ బాబులు, నువ్వు నేను, ఒసేయ్ ఒరేయ్ వంటి చిత్రాలలో కూడా నటించింది. అలాగే రాజా ది గ్రేట్ సినిమాలో కూడా చిన్న పాటలో కనిపించింది. కానీ బిగ్ బాస్ ద్వారా ఈసారి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో మంచి పాపులారిటీ అందుకున్నది.