తమన్నా ప్రియుడికి కూడా తప్పని కష్టాలు.. ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. నాని నటించిన MCA సినిమాలో విలన్ పాత్రలో నటించి అదరగొట్టేశారు. అయితే ఆ తర్వాత హీరోయిన్ తమన్నాతో లవ్ ఎఫైర్ వల్ల మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడినట్లుగా తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి వెబ్ సిరీస్లలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. తెలుగులో నటుడిగా కంటే తమన్నా బాయ్ ఫ్రెండ్ గా మంచి పాపులారిటీ అందుకోవడం జరిగింది. అయితే ఈయన మంచితనానికి తమన్నా సైతం ఫిదా అయ్యి ఇతడినిని ప్రేమిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

అయితే గతంలో బాలీవుడ్లో తనకు ఎదురైన చేదు ఘటనలను తెలియజేస్తూ ఉన్నారు విజయ్ వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక స్టేజ్లో తాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్ననని తన అకౌంట్లో 18 రూపాయలు మాత్రమే ఉండే వంటు తెలియజేశారు.అప్పుడు సినిమా అవకాశాలు రాలేదు ఆ సమయంలో రిపోర్టర్ గా కూడా పనిచేశాను.. ఒకరోజు సినిమా షూటింగ్ చేస్తే 3000 ఇస్తామన్నారు ఆ పాత్ర చేయడం ఇష్టం లేక డబ్బుల కోసమే మాత్రమే ఆ పని చేయవలసి వచ్చిందని తెలిపారు.

ఆ సమయంలో తన మనసుని బండరాయి చేసుకొని షూటింగ్ కి వెళ్లానని ఆ రిపోర్టింగ్ ఇంగ్లీషులో చేయమన్నారు.. కానీ అది అంత ఈజీ కాదు తనను సెట్ లో రిజెక్ట్ చేశారని అప్పటికే ఒక సినిమాలో ప్రధాన పాత్ర పోషించాను అయినా సరే చిన్న నటుడుగా భావించి తనకు అసలు గౌరవం ఇచ్చేవారు కాదని ఆరోజు తన ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్ళానని డబ్బు కోసం ఏది పడితే అది చేయకూడదు అనుకునే నిర్ణయాన్ని ఆరోజు తీసుకున్నానని తెలిపింది. ఈ సంఘటన 2014లో జరిగిందని తెలిపారు.