“బాలయ్యతో సినిమా చేయొద్దని వాళ్లు పదే పదే చెప్పారు”.. సంచలన విషయాని బయటపెట్టిన శ్రీలీల..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా భగవంత్  కేసరి . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే థియేటర్స్ వద్ద నందమూరి అభిమానుల హంగామా మొదలైంది . ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడిగా నటిస్తూ ఉండగా శ్రీ లీల ఆయన కూతురి పాత్రలో కనిపించబోతుంది.

సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న కాజల్ శ్రీ లీల సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశారు.  ఈ క్రమంలోని రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీ లీల షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది . “నాకు భగవంత్ కేసరి సినిమాలో ఆఫర్ వచ్చిందని తెలిసి కొందరు నాకు పర్సనల్గా కాల్ చేసి ఆ సినిమాలో నటించొద్దు అంటూ సజెస్త్ చేశారని చెప్పుకొచ్చింది “.దీంతో ఒక్కసారిగా నందమూరి అభిమానులు షాక్ అయిపోయారు .

” అప్పటికే నాకు హీరోయిన్ గా వరుస ఆఫర్స్ వస్తున్న క్రమంలో ఇందులో కూతురి పాత్ర. ఎందుకు..? ఈ సినిమా చెయ్యొద్దు..నో చెప్పు అని చాలా మంది చెప్పారు. కానీ హీరోయిన్ గా ఇది కాకపోతే ఇంకో ఆఫర్ రావొచ్చు . కానీ నా లైఫ్ లో ఇలాంటి పాత్రలు వదులుకుంటే మళ్ళీ వస్తాయో లేదో తెలియదు. అందుకే వచ్చినప్పుడు ఒప్పేసుకున్నాను” అని చెప్పుకొచ్చింది.. దీంతో శ్రీలీల చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.