వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్ లాక్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వరుణ్ తేజ్ వివాహం హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో జరగబోతున్న సంగతి తెలిసిందే.. రీసెంట్గా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి యొక్క ఎంగేజ్మెంట్ కూడా చాలా ఘనంగా జరిగింది. అయితే వీరి పెళ్లి తేదీ పైన పలు రకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. కానీ తాజాగా వీరి స్నేహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 1వ తారీఖున ఇటలీలో వీరి వివాహం జరగబోతున్నట్లు తెలుస్తొంది.

Varun Tej and Lavanya Tripathi to tie the knot? Actress has THIS to say |  Masala News – India TV

గత కొంతకాలంగా పెళ్లి డేట్ పైన చాలా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే ఇలా తేదీ తెలిసిన వెంటనే పలువురు అభిమానులు సైతం చాలా ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఈ వేడుకకు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ మెగా కుటుంబం సభ్యులు అందరూ కూడా పలువురు అతిథులతో స్నేహితులతో మాత్రమే ఈ వివాహం జరగబోతుందని సమాచారం. వివాహం తర్వాత నెల రోజులపాటు హనీమూన్ ని ఎంజాయ్ చేయబోతున్నట్లు సమాచారం.

అయితే రిసెప్షన్ ని హైదరాబాదులో నిర్వహించేలా పలు రకాల ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 9వ తేదీన హైదరాబాద్లో లావణ్య త్రిపాఠి ,వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. అందుకే ప్రస్తుతం వరుణ్ తేజ్ ఎక్కువగా తన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. వరుణ్ తేజ్ నటించిన గత చిత్రాల f -3,గని, గాండీవ దారి అర్జున వంటి సినిమాలు ఘోరమైన డిజాస్టర్ లను మూట కట్టుకున్నాయి. ఈసారి ఆపరేషన్ వాలెంటైన్స్,మట్కా సినిమా లతో మంచి విజయాన్ని అందుకోవాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.