సామ్‌కు గిఫ్ట్‌లు పంపిన న‌య‌న‌తార‌… ఫొటోలు చూశారా…!

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ ఈ మధ్య ” 9 SKlN ” పేరుతో బ్యూటీ ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. ఇంటర్నేషనల్ వైడ్ సేలింగ్ ఇప్పటికే మొదలు కాగా… సెలబ్రెటీస్‌కు ఇందుకు సంబంధించిన ప్రొడక్ట్స్ ను గిఫ్ట్ గా పంపించింది నయన్.

ఈ క్రమంలోనే సమంతకు కూడా సెండ్ చేయగా.. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రొడక్ట్స్ అమేజింగ్ గా ఉన్నాయని.. ట్రై చేసేందుకు వెయిట్ చేయలేకపోతున్నానని తెలిపిన సమంతా.. నయనతార అండ్ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పింది. కాగా సమంత, నయనతార విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో వచ్చిన kRK మూవీలో స్క్రీన్ షేర్ చేసుకోగా.. అప్పటినుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక సమంత విషయానికొస్తే.. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది.

తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా వచ్చిన సినిమా ” ఖుషి “. ఈ సినిమా సమంత ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం తన ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిన సంగతి మన అందరికీ తెలిసిందే. తన ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది.