హవ్వ..విజయ్ దేవరకొండ డైలాగ్ పై ఇన్ని బూతు ట్రోలింగా.. పబ్లిసిటీగా కూడా వాడేస్తున్నారుగా(video)..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది . ఎంతలా అంటే అసలు నిద్ర లేచిన మొదలు పడుకునే వరకు ఏదో ఒక విషయం కారణంగా స్టార్ సెలబ్రిటీస్ ని ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ అలాంటి ట్రోలింగ్ బాధలకు గురవుతున్నాడు . మొదటి నుంచి విజయ్ దేవరకొండ పై ఓ మీమ్ బ్యాచ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది .

అయితే రీసెంట్గా ఆయన నటించిన ఫ్యామిలీ స్టార్ కి సంబంధించిన వీడియో వైరల్ అయింది . ఈ క్రమంలోనే ఆ వీడియోలో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ను రీ క్రియేట్ చేస్తూ కొందరు మీమ్‌స్ తో ట్రోల్ చేస్తున్నారు . టీజర్ వీడియోలో ఓ సీన్లో “ఐరన్ నే వంచాలా ఏంటి ..?” అని విజయ్ దేవరకొండ విలన్లకు కౌంటర్ వేస్తాడు.

అయితే ఇక్కడ కొందరు “ఇంటర్నెట్ అస్సలు ఏమి నడుస్తుంది అనే మీమ్ తో ‘ఈరొన్ యె వంచల ఎంతీ అని కాకుండా ‘ఆఇరనె వంచల ఎంతీ అనే హ్యాష్ ట్యాగ్ తో దారుణంగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ టీజర్ ఐరన్ రాడ్ యాడ్ లా ఉందని కొందరు ట్రోల్ చేస్తుంటే.. మరికొందరు ఆ డైలాగ్ డెలివరీ ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు బూతు వీడియో కి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!