ర‌వితేజ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `క్రాక్‌`ను క‌థ న‌చ్చ‌లేద‌ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

మాస్‌ మహారాజా రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో క్రాక్ ఒకటి. 2017లో విడుదలైన `రాజా ది గ్రేట్` తర్వాత చాలా ఏళ్ళు హిట్ ముఖమే చూడని రవితేజ.. 2021 లో వచ్చిన క్రాక్ మూవీ తో భారీ హిట్ అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్రాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవర్ ఫుల్‌ పోలీస్ అధికారిగా రవితేజ అద‌ర‌గొట్టేశాడు.

శృతి హాసన్ హీరోయిన్‌ నటిస్తే.. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్ ను అందుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే క్రాక్ మూవీకి ఫస్ట్ ఛాయిస్ రవితేజ కాదు. రవితేజ కంటా ముందే ఈ మూవీ కథ టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో వద్దకు వెళ్ళింది.

కానీ కథ నచ్చకపోవడంతో సదురు హీరో క్రాక్‌ ను రిజెక్ట్ చేశాడు. ఇంతకీ అతను మరెవరో కాదు విక్టరీ వెంకటేష్. డైరెక్టర్ గోపీచంద్ మలినేని మొదట క్రాక్ కథను వెంకటేష్ కే చెప్పారట. అయితే కథ‌ వెంకటేష్ కు పెద్దగా కనెక్ట్‌ కాకపోవడంతో.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత గోపీచంద్ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి రవితేజకు వినిపించారు. ఆయనకు స్టోరీ నచ్చడంతో వెంటనే సినిమాకు ఓకే చెప్పారు. అలా పట్టాలెక్కిన క్రాక్.. ర‌వితేజ ఖాతాలో బ్లాక్ బ‌స్ట‌ర్ గా ప‌డింది.