ఎన్టీఆర్ దేవర మూవీ తాజా షెడ్యూల్ ఇదే..!

ప్రముఖ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం దేవర. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్… ఇందులో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తూ ఉండగా.. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ బయటకు రావడంతో అభిమానులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ , జాన్వి మధ్య రొమాంటిక్ సెషన్ పూర్తి చేసే పనిలో పడ్డ డైరెక్టర్ ఇప్పటికే నటీనటులు కూడా గోవా కి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఎన్టీఆర్ కూడా ఇప్పటికే గోవా చేరుకున్నారట. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ మొదటిసారి తెలుగులో హీరోయిన్గా నటిస్తోంది . అలాగే ఈ సినిమా ద్వారా సౌత్ ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమా పక్కా ప్రణాళికతో షూటింగ్ జరుగుతోందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా దేవర నెక్స్ట్ షెడ్యూల్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారగా.. ఈ సినిమా షెడ్యూల్ ఇప్పుడు గోవాలో జరుగుతోందట. హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఎన్టీఆర్ కెమెరా కళ్ళకు చిక్కడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది.

ఈ షెడ్యూల్లో హీరోయిన్ జాన్వి కపూర్ తో కాంబినేషన్ సీన్లతో పాటు కాస్త ఘాటు రొమాన్స్ కూడా చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అలాగే వీరిద్దరికీ సంబంధించిన పాట సన్నివేశం కూడా ఇక్కడ చిత్రీకరించబోతున్నారట. ఇక్కడ షెడ్యూల్ పూర్తయిన వెంటనే కర్ణాటకకి టీ మొత్తం వెళ్లనున్నారని.. అక్కడ ఫేమస్ టూరిజం స్టార్ట్ అయిన గోకర్ణంలో భారీ సెట్టింగ్లతో షూటింగ్ జరుపనున్నారని సమాచారం. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసి అనుకున్న సమయానికి దేవర సినిమాను రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ తో ఉన్నారట డైరెక్టర్.