ఆ క్రేజీ హీరోకి జోడిగా అక్క‌డ ఎంట్రి ఇస్తున్న అనుష్క‌..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత వరుస‌ అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారింది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ బ్యూటీ.. అరుంధతి సినిమాతో తన అద్భుతమైన నటనతో మెప్పించింది.ఈ మూవీ టాలీవుడ్ లోనే కాదు తమిళ్ ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత భాగమతి సినిమాతో నట విశ్వరూపం చూపించిన అనుష్క.. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగుతోపాటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించిన అనుష్క జీరో సైజ్ సినిమా లో నటించడం కోసం బరువు అధికంగా పెరిగిపోయింది. తర్వాత వెయిట్ తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిన సక్సెస్ కాలేకపోయింది. దీంతో మెల్లమెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఇటీవల నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చి.. సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. ఈ స‌క్స‌స్‌తో మళ్లీ కొత్త ఉత్సాహంతో సినిమాల్లో నటించడానికి రెడీ అయింది అనుష్క.

తాజాగా ఓ మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. హోమ్ మూవీ ఫేమ్ రోజిన్ థామస్ డైరెక్షన్లో వస్తున్న ఎస్ జె సూర్య మూవీలో హీరోయిన్గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇది ఓ హిస్టారికల్ డ్రామాగా తెలుస్తుంది. అంతేకాదు ఇది రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు నటించిన పాత్రలన్నింటికీ భిన్నంగా ఈ పాత్ర ఉండడంతో అనుష్క ఇందులో నటించడానికి ఓకే చేసిందంటూ న్యూస్ వినిపిస్తుంది.