కోడిగుడ్డులోని పచ్చ సోనా తినకూడదా..?

కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సైతం ఎక్కువగా వీటిని తినమని సూచిస్తూ ఉంటారు. అందులో భాగంగానే చాలామంది ప్రతిరోజూ ఒక గుడ్డుని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు.. అయితే మరి కొంతమంది లావుగా మారుతారని గుడ్డులోని కేవలం తెల్లసొన ను మాత్రమే తింటూ పచ్చసోనని వదిలేస్తూ ఉంటారు.. అందుకే కేవలం ఎక్కువ వైట్ సొనని మాత్రమే తినడానికి చాలామంది ఇష్టపడతారు.ఇంతకీ కోడిగుడ్డులోని పచ్చసోనా తినవచ్చా లేకపోతే తినకూడదా అనే విషయంపై చాలామంది కన్ఫ్యూజన్ గా ఉన్నారు. తాజాగా ఒక యూనివర్సిటీ సైంటిస్టులు రీసెర్చ్ తో పలు విషయాలను తెలిపారు.

వారి పరిశోధనలో తెలిపిన ప్రకారం సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అయితే మనలో చాలామంది పచ్చసొనను తీసుకోవడానికి చాలా ఇష్టపడరు. ఎందుకంటే ఇది ఫ్యాట్ ఫుడ్ అని అనుకుంటూ ఉంటారు.. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న కొంతమంది ఆరోగ్యవంతులను ఈ రీసెర్చ్ కోసం ఉపయోగించుకున్నారట. ఇందులో కొంతమందికి ఎక్కువ వైట్ తినేలా మరికొంతమందికి పచ్చ సన్న తో కలిపి గుడ్డు మొత్తం తినేలా ఆహారాన్ని అందించినట్లు సమాచారం.

అయితే నాలుగు వారాల తర్వాత వారి డైట్ను బట్టి జీర్ణక్రియ ప్రొఫైల్ ను పరిశీలించగా వీటిలో మొత్తం గుడ్డు తిన్న వారి శరీరంలో కొలిన్ అనే పోషకం పెరుగుదలను చూపించిందని సైంటిస్టులు తెలియజేస్తున్నారు. ఇందులో ఉండే కొలిన్ పదార్థం నాడి వ్యవస్థ జ్ఞాపకశక్తి మానసిక స్థితి కండరాలను నియంత్రించడానికి సహాయపడుతుందట.

గుడ్డులోని పచ్చ సోన తింటే కొవ్వు పెరిగి గుండె పైన ప్రభావం చూపిస్తుందని అనుకుంటూ ఉంటారు.. కానీ సైంటిస్టులు తెలిపిన ప్రకారం పచ్చ సన్న కలిగిన గుడ్డు తిన్నవారిలో..TMAO అసలు మారలేదని గుడ్డు మొత్తం తినడం వల్ల మైక్రో న్యూట్రిమెంట్, డైట్ క్వాలిటీ కొలీగ్ మంచి కొలెస్ట్రాల్ వంటివి పెరుగుదలను గుర్తించినట్లుగా తెలిపారు.