రజనీకాంత్ తో నటించే ఛాన్స్ ను రిజెక్ట్ చేసిన త్రిష.. కారణం అదేనా..?

సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది రజనీకాంత్. ఒక సాధారణ బస్సు కండక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసిన రజినీకాంత్ చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సూపర్ స్టార్ గా ఎదిగాడు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ కోసం కష్టపడే ప్రతి సాధారణ వ్యక్తికి రజనీకాంత్ బెస్ట్ ఇన్స్పిరేషన్. ఆయన్ని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ముఖ్యంగా ఆయన పక్కన చిన్న పాత్రలు నటించే అవకాశం వచ్చిన ఎవరు వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆయన సినిమాలో నటిస్తే ప్రపంచం మొత్తం మనల్ని గుర్తిస్తుంది అనే ఓ చిన్న ఆశతో ఉంటారు.

 

ముఖ్యంగా హీరోయిన్స్ అయితే ఛాన్స్ అస‌లు రిజెక్ట్ చేయరు. ఎలాంటి పాత్ర నటించడానికి అయినా రెడీ అయిపోతారు. అయితే ఒకప్పుడు సౌత్‌లో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్గా క్రేజ్ ను దక్కించుకున్న త్రిష కృష్ణ మాత్రం రజనీకాంత్ పక్కన హీరోయిన్గా నటించే అవకాశం వచ్చిన దానిని రిజెక్ట్ చేసిందట. అప్పట్లో రజినీకాంత్ – శంకర్ కాంబోలో వచ్చిన శివాజీ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ సినిమాలో హీరోయిన్‌గా శ్రీయ శరణ్ నటించింది. అప్పట్లో ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఇక ఇందులో శ్రీయ న‌ట‌న‌కి కూడా మంచి మార్కులు పడ్డాయి.

కాగా ఈ పాత్రకు ముందుగా త్రిష ని అనుకున్నారట. ఇలాంటి బడా ప్రాజెక్టులో హీరోయిన్గా ఛాన్స్ వస్తే ఈ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది.. కానీ త్రిష మాత్రం ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేసింది. అప్పటికే ఆమె చేతిలో నాలుగు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్న కారణంగా ఆమె ఈ మంచి అవకాశాన్ని రిజెక్ట్ చేసిందట. పాత్ర నీకు బాగా సెట్ అవుతుంది.. ఎలాగోలా డేట్ అడ్జస్ట్ చేసుకొని ఇవ్వు అని శంకర్ అడిగినా కూడా నో చెప్పిందట. ఇక‌ సెకండ్ ఛాయిస్‌గా శ్రీ‌యను ను కన్సల్ట్ అయ్యారు. శ్రీ‌య‌ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇప్ప‌టివ‌ర‌కు త్రిష – ర‌జినీ హీరో హీరోయిన్‌లుగా ఒక్క సినిమా కూడా రాలేదు.

కానీ పేట సినిమాలో రజనీకాంత్ చెల్లెలుగా త్రిష నటించిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. అయితే ప్రస్తుతం రజనీకాంత్ చేయబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ త్రిషకు వచ్చిందట. కానీ ఒకసారి చెల్లెలుగా నటించి మళ్లీ అదే హీరోతో రొమాన్స్ చేయడం ఇష్టం లేదని.. ఈసారి వచ్చిన అవకాశాన్ని కూడా రిజెక్ట్ చేసిందట త్రిష. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో త్రిష కేమైనా పిచ్చా.. రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ కి అతని పక్కన నటిస్తే ఆమెకు మళ్లీ స్టార్ హీరోయిన్ హోదా దక్కుతుంది.. అలాంటి అవకాశాన్ని వదులుకుంటుందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.