అప్పుడు సమంత-నాగచైతన్య..ఇప్పుడు ఈ యంగ్ హీరో-హీరోయిన్..డిట్టో లవ్ స్టోరి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత హీరో నాగచైతన్య ఎలాంటి ట్రోలింగ్ కి కి గురవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా హీరోయిన్ సమంతను విడాకులు తీసుకున్న తర్వాత కొందరు జనాలు దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడంటే వీళ్ళపై ఇలా ట్రోలింగ్ జరుగుతుంది కానీ గతంలో వీళ్ళు చాలా చాలా పాజిటివ్ కామెంట్స్ వినిపించేవి.

ఏం మాయ చేసావే సినిమాలో వీళ్ళ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న ఈ జంట రియల్ లైఫ్ లో కూడా మంచి భార్యాభర్తలు గా మెలిగారు. అయితే కొన్ని కారణాల చేత డివోర్స్ తీసుకున్నారు . ఇప్పుడు ఇలాంటి ఓ లవ్ స్టోరీని మనం ఇండస్ట్రీలో చూస్తున్నాం. వాళ్ళు మరెవరో కాదు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా. ఏం మాయ చేసావే సినిమా సమంత – నాగచైతన్య ను కలిపితే గీత గోవిందం సినిమా విజయ్ రష్మికలను కలిపింది .

అంతేకాదు గతంలో సమంత నాగచైతన్య లను.. “మీరు ప్రేమించుకుంటున్నారా..?” అంటూ పలువురు ప్రశ్నించిన “అలాంటిది ఏమీ లేదు ..ఫ్రెండ్షిప్ అని కొట్టి పడేశారు”. తీరా పెళ్లి చేసుకున్నారు . ఇప్పుడు కూడా ఈ రష్మిక – విజయ్ అలానే సమాధానం ఇస్తున్నారు . మాది ప్యూర్ ఫ్రెండ్షిప్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఫ్యూచర్లో వీళ్ళు కూడా చైతన్య సమంత లాగా పెళ్లి చేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు జనాలు..!!