ఛీ..ఛీ..రతికది ఇంత చీప్ క్యారెక్టరా?..అప్పుడు రైతు బిడ్డ..ఇప్పుడు ఈ యావర్ బిడ్డ..బలి పశువులు అయ్యరే..!!

బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తోనే సాగుతుంది. ఎవరు ఇంటికి వెళ్తారో.. ఎవరు హౌస్ లో ఉంటారో అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. కొన్ని సమయాల్లో టాస్కులు కూడా అదే విధంగా ఉంటున్నాయి. అలాగే ఈ వారం ఎలిమినేషన్ కూడా ఉల్టా పుల్టా లాగానే జరిగింది. ఎందుకంటే శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందనే అనుకున్నప్పటికీ.. సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. వాస్తవానికి చెప్పాలంటే సందీప్ – శోభా కంటే ఓటింగ్ లో ముందే ఉన్నాడు.

అయితే సందీప్ ఎలిమినేషన్ కి ముందు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇద్దరి ఫోటోలు ఇచ్చి అందులో పడవలో నుంచి బయటకు తోసేయాలంటే ఎవరిని తోసేస్తారు అని నాగ్‌ ప్రశ్నించాడు. రీ ఎంట్రీ ఇచ్చిన రతిక మాత్రం ముందు నుంచే యావర్ కు దగ్గర కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అటు ప్రశాంత్ మనసులో చోటు కోసం ఆరాటపడింది. అది దక్కకపోవడంతో యావర్ వైపుకు మళ్ళింది. ” ఈ హౌస్ లో నేను నిన్ను, శివన్న ని తప్ప ఇంకెవరిని నమ్మను ” అంటూ యావర్ ను బుట్టలో వేయడానికి ప్రయత్నించింది. నిజానికి చెప్పాలంటే యావర్ కూడా ఆ గాలంలో చిక్కాడు.

ఈ క్రమంలోనే ప్రశాంత్, శివాజీలు యావర్ ను పడవలో నుంచి తోసేస్తాం అని చెప్పారు. దీనికి కారణం ఏంటంటే.. రతిక తో ఎక్కువ తిరగడం, తను చెప్పింది చేయడమే అని శివాజీ, ప్రశాంత్ ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. అనంతరం నాగ్ రతికాని లేపి “ఏమైంది..?” అని అడగగా.. “ఎవరేంటో ఇప్పుడే తెలుస్తుంది” సార్ అంటూ చెప్పింది. ఇది విన్న ప్రేక్షకులు అప్పుడు రైతు బిడ్డ.. ఇప్పుడు ఈ యావర్ బిడ్డ అంటూ కామెంట్లు చేస్తున్నారు..!!