టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇంద్రజ కూడా ఒకరు. ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈమె చాలా కాలం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంద్రజ బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలకు జడ్జిగా వ్యవహరిస్తుంది.
అలాగే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీబిజీగా గడుపుతుంది. అయితే ప్రస్తుతం ఇంద్రజకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంద్రజది ప్రేమా వివహం అన్న సంగతి తెలిసిందే. ఇమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇక ఇంద్రజ ముస్లిం కుటుంబానికి చెందినటువంటి ఓ అబ్బాయిని ప్రేమించి వివాహం చేసుకుంది. మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తితో ప్రేమలో పడి అతని వివాహం చేసుకొని ముస్లిం ఇంటికి కోడలుగా వెళ్ళింది. ప్రస్తుతం ఇంద్రజ భర్త బిజినెస్ పనులలో బిజీగా గడుతున్నారు.
ఇక ఇటీవల ఓ ఈవెంట్లో ఇంద్రజ మాట్లాడుతూ ఇంట్లో ప్రతి ఒక్కరు నన్ను చాలా ఆదరిస్తారని.. తను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా అమ్మాయి కావడంతో ఎలాంటి మాంసాహార పదార్థాలను కూడా తిననని.. తన భర్త ముస్లిం వ్యక్తి కావడంతో వారికి నాన్ వెజ్ తినడం బాగా అలవాటు నేను వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత నా కోసం ఆ ఇంట్లో వారంతా మాంసాహారం తీసుకోవడం మానేశారు అంటూ వివరించింది. తన భర్త తన కోసం మాంసాహారం తినడమే మానేశారు అంటూ వివరించిన ఇంద్రజ ఇప్పటివరకు ఒకసారి కూడా ఇంట్లో నాన్ వెజ్ చేయలేదని చెప్పుకొచ్చింది.
ఇక నేను లేకుండా బయటకు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ బయటకు వెళ్తే నాన్ వెజ్ తినడానికి నేను ఓకే చెప్పానని. దాంతో అప్పటినుంచి ఆయన బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే నాన్ వెజ్ తీసుకుంటారని.. ఇక ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ ఇంట్లో మాంసాహారం వండలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మిమ్మల్ని ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా అర్థం చేసుకునే భర్త దొరకడం మీ అదృష్టం అంటూ.. మీరు చాలా లక్కీ అంటూ.. నెట్టిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.