ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ..ఆ పాన్ ఇండియా డైరెక్టరా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలోనే పాపులారిటీ సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్ ఎంత త్వరగా ఇండస్ట్రీలోకి వచ్చాడో.. అంతే త్వరగా కనుమరుగైపోయాడు . అంతేకాదు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు .. చాలా చిన్న ఏజ్ లోనే సూసైడ్ చేసుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు ఉదయ్ కిరణ్. కాగా ఉదయ్ కిరణ్ మరణం పై ఇప్పటికీ మిస్టరీ అలాగే నెలకొంది .ఆయనది సూసైడ్ అని చెప్పుకొస్తున్న ఆయన సూసైడ్ చేసుకున్న దానికి కారణం మాత్రం ఇది అంటూ ఎవరు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

అయితే ఆయన మరణానికి పరోక్షకంగా రాజమౌళి కారణమంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సై . ముందుగా ఈ సినిమాలో హీరోగా ఉదయ్ కిరణ్ ని అనుకున్నారట . అయితే ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉండే కొందరు పెద్ద మనుషులు ఆ సినిమా నుంచి ఉదయ్ కిరణ్ ని తీసేయకపోతే మేం స్పాన్సర్ చేయమంటూ హ్యాండ్ ఇచ్చారట .

దీంతో వేరే గత్యంతరం లేక రాజమౌళి ఆయనని తప్పించారు . ఆ తర్వాత నితిన్ ఆ ప్లేస్ లోకి వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు . అంతేకాదు ఈ సినిమా నుంచి తప్పుకున్నాక ఉదయ్ కిరణ్ కెరియర్ ఎంత డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాగా డిప్రెషన్ కి లోనైపోయిన ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలు రావడం లేదు అంటూ బాధపడి సూసైడ్ చేసుకున్నాడు అని అప్పట్లో ప్రచారం జరిగింది . పరోక్షకంగా రాజమౌళినే ఉదయ్ కిరణ్ మరణానికి కారణం అంటూ ఆయన మరణించిన రోజు చాలామంది జనాలు కామెంట్స్ చేశారు..!!