దాదాపు 10 సంవత్సరాల తరువాత మళ్ళీ సమంత కి కాల్ చేసిన ఆ హీరో.. ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ హాస్పిటల్ లో ఉంది . ఈ విషయాన్ని ఆమె స్వయాన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది . తనకున్న హెల్త్ ఇష్యూస్ కారణంగా రెగ్యులర్ ట్రీట్మెంట్ లో భాగంగా సమంత హైదరాబాదులోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది . అయితే ఇలాంటి క్రమంలోని సమంతకు తన పాత జాన్ జిగడి దోస్త్ కాల్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆ హీరో సమంతకి కాల్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు సిద్ధార్థ్. గతంలో సమంత సిద్ధు ల మధ్య ఏదో నడిచింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. వీళ్ళిద్దరూ కలిసి శ్రీకాళహస్తి గుడిలో పూజలు కూడా చేశారు. అవి ఎందుకోసం చేశారో వారికే తెలియాలి . అయితే పెళ్లి చేసుకోవడానికి వీళ్ళు ఇలా పరిహార పూజలు చేశారు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

అయితే వీళ్ళు విడిపోయి దాదాపు పది సంవత్సరాలు కావస్తుంది. వీళ్లు విడిపోయినప్పటి నుంచి సమంత సిద్ధార్ధ్ ఎక్కడ మాట్లాడుకోలేదు . అయితే ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సమంతకు హీరో సిద్ధార్ధ్ కాల్ చేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . రీసెంట్గా ఆయన నటించిన సినిమా చిన్న. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . ఈ క్రమంలోనే సమంత డైరెక్టర్ అరుణ్ కుమార్ ను కాల్ చేసి మరి స్పెషల్ గా విష్ చేసిందట . దీంతో సమంత నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సిద్ధార్థ్ ఆమెకు కాల్ చేసి మరి హెల్త్ ఇష్యూ గురించి పరామర్శించారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దీనిపై సమంతకాని సిద్ధార్ధ్ కానీ స్పందిస్తే అసలు నిజానిజాలు బయటపడతాయి..!!