అప్పుడే తోడికోడళ్ల గొడవలు.. ఉపాసన పై గుర్రుగా ఉన్న లావణ్య..ఏమైందంటే..?

తోడికోడల మధ్య గొడవలు సర్వసాధారణం .. ఏ ఇంట్లో అయినా సరే కచ్చితంగా గొడవలు పోట్లాటలు జరుగుతూ ఉంటాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న కుటుంబంలోని కోడలు మధ్య కూడా ఇలాంటి గొడవలు జరుగుతాయి అంటే అవునని సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. రీసెంట్గా అదే లిస్టులోకి వచ్చేసారు మెగా కోడలు ఉపాసన – లావణ్య త్రిపాఠి .

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిను ప్రేమించారు. రీసెంట్గా నిశ్చితార్థం చేసుకున్నారు . త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి గ్రాండ్గా ఇటలీలో జరగబోతుంది. అయితే ఇలాంటి క్రమంలోనే ఉపాసన ..లావణ్య – వరుణ్ పెళ్లి పై స్పెషల్ కేర్ తీసుకొని వెడ్డింగ్ పనులను దగ్గరుండి చూసుకుంటుందట . కాస్ట్యూమ్ డిజైనింగ్.. ఇంటీరియర్ డిజైనింగ్.. వెడ్డింగ్ థీమ్స్ అన్ని ఉపాసన తానే దగ్గరుండి చూసుకుంటుందట.

ఈ క్రమంలోనే ఉపాసనాకి లావణ్య కి మధ్య క్లాష్ ఏర్పడింది. ఉపాసన డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ లావణ్య కు నచ్చలేదు . ఇదే విషయాన్ని చెప్పగా ఉపాసన హర్ట్ అయిందట. సీరియస్ అయిపోయిందట . ఇక్కడే వీళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో ఉపాసన బిహేవియర్ పై లావణ్య అసహనం వ్యక్తం చేస్తున్నట్లు మెగా కాంపౌండ్ నుంచి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి..!!