కాస్టింగ్ కౌచ్ కు కారణం అదే.. నాకు ఆ పరిస్థితి వస్తే నవ్వి వదిలేసేదాన్ని.. నటి రేవతి కామెంట్స్ వైరల్..

సినీ నటి రేవతి ఒకప్పుడు టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సబ్‌మిట్‌లో పాల్గొన్న రేవతి సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం మీద ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న కొన్ని పరిస్థితుల గురించి ఆమె చెప్పుకొచ్చింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు 1980 – 1999లో ఫోన్లు లేవని అసలు మొబైల్ ఫోన్లు, మెసేజ్ తోనే చాలా సమస్యలు ముడిపడి ఉంటాయని నేను నమ్ముతాను అంటూ చెప్పుకొచ్చింది.

ఎందుకంటే ఎవరైనా కలలోకి చూసి నాకు నువ్వు కావాలి.. నాతో ఉండు అని తప్పుడు ఉద్దేశంతో అడగడం అంత ఈజీ కాదని అందుకే అప్పట్లో కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు అంతగా ఉండేవి కాదని అర్థం వచ్చేలా ఈమె వివరించారు. ఈ రోజుల్లో ఒక్కో మెసేజ్ పెడితే వచ్చి కలువు, కాఫీ తాగుదామా అని వందల మెసేజ్లకు దారితీస్తుందని.. ఈ రోజుల్లో ఎక్కువ ఇబ్బంది పరిస్థితులు నా ఉద్దేశంలో అయితే మొబైల్ ఫోన్ల వల్లే అంటూ చెప్పుకొచ్చింది. మొబైల్ ఫోన్ల వల్ల ఏమోజీల‌ వాడకం కూడా ఎక్కువైందని.. అది అతిపెద్ద సమస్యగా మారిందని ఆమె చెప్పుకొచ్చింది.

ఎమోజీలను సరిగ్గా అర్థం చేసుకొని ఉపయోగించాలని లేకపోతే అది అవతలి వ్యక్తికి తప్పుగా అర్థమయ్యే అనేక సమస్యలు దారితీస్తాయని ఆమె వివరించింది. ప్రొఫెషనల్ విషయాలను మాట్లాడే సమయంలో ఎమోజీలను వాడడం అంత మంచిది కాదని ఆమె సలహా ఇచ్చింది. ఒకప్పుడు స్త్రీ, పురుషులు అనేవారు ఒక దగ్గర ఉంటే సరదాగా మాట్లాడటం అనేది ఉండేది కానీ అది దాటి వెళితే అంగీకారం కావాలి.. ఆ అంగీకారం ఇండస్ట్రీలో ఉండేది కాదని చెప్పుకొచ్చారు.

అప్పట్లో ఏదైనా చెడు అనుభవం ఎదురైతే నవ్వి నో అని చెప్పే వాళ్ళమని.. ఆ తర్వాత క్లోజ్ గా ఉండే వాళ్ళతో ఆ విషయాన్ని షేర్ చేసుకునే వాళ్ళమని ఆమె వివరించింది. ఎవరైనా నాతో తప్పుగా ప్రవర్తిస్తే అలా మాట్లాడిన వారికి కొంచెం బుద్ధి ఇస్తే బాగుంటుంది అనుకునేదాన్ని.. కానీ పైకి మాత్రం నవ్వి వదిలేసేదాన్ని అంటూ వివరించింది. ప్రస్తుతం న‌టి రేవతి కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.