“అలా చేయడం తప్పు అని తెలుసు..కానీ తప్పడం లేదు”..శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీలా తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి . నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది . శ్రీలీల ఆయనకు కూతురు పాత్రలో కనిపించబోతుంది . అక్టోబర్ 19న దసరా కానుకగా ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీ లీల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తాను ఎందుకు డాక్టర్ అవ్వాలి అనుకున్నాను అన్నదానిపై క్లారిటీ కూడా ఇచ్చింది . “ఓ రోజు వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయిందట .. అయితే అందరిలాగే తాను నిస్సహాయంగా చూస్తూ ఉన్నానని .. కానీ మా బ్రదర్ డాక్టర్ కావడంతో వెంటనే వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చారని.. అప్పుడే అనిపించింది నేను డాక్టర్ అవ్వాలని అని చెప్పుకొచ్చింది”.

అంతేకాదు సినిమాలో నటిస్తూ డాక్టర్ చదువు చదవడం చాలా చాలా కష్టం.. మార్నింగ్ షూటింగ్స్ చేసుకొని రాత్రులు చదువుకుంటూనే ఉంటాను ..కొన్నిసార్లు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది .. కానీ రెండు ఇష్టంగా చేయడంతో నాకు ఆ బాధ తెలియడం లేదు ..కొన్నిసార్లు ఇది తప్పు అని తెలుసు ..కానీ తప్పక తప్పు చేయడం తప్పడం లేదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..!!