బాలీవుడ్ లో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ర‌ష్మిక‌.. ఆ స్టార్ హీరోయిన్ భ‌ర్తతో రొమాన్స్‌!?

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా చేతినిండా సినిమాల‌తో ఎంత బిజీగా ఉందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. త్వ‌ర‌లోనే బాలీవుడ్ మూవీ యానిమ‌ల్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న ర‌ష్మిక‌.. ప్ర‌స్తుతం తెలుగులో అల్లు అర్జున్ తో పుష్ప 2, రెయిన్ బో అనే సినిమాలు చేస్తోంది. అలాగే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ కు జోడీగా ఓ మూవీ, వెంకీ కుడ‌ముల డైరెక్ష‌న్ లో నితిన్ తో ఓ సినిమాకు క‌మిట్ అయింది.

యానిమ‌ల్ విడుద‌ల కాకుండానే ర‌ష్మిక బాలీవుడ్ లో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది. స్టార్ హీరో క‌త్రీనా కైఫ్ భ‌ర్త‌, హీరో విక్కీ కౌశల్ తో ర‌ష్మిక రొమాన్స్ చేయ‌బోతోంది. `ఉరి` మూవీతో బాలీవుడ్​లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కౌశల్.. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతున్నారు. ఇటీవ‌లె జర హట్కే జర బచ్కే సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్న విక్కీ ప్ర‌స్తుతం `చావా ది గ్రేట్ వారియర్` అనే మూవీ చేస్తున్నాడు.

పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు దాదాపు రూ. 150 కోట్లు బ‌డ్జెట్ పెడుతున్నారు. విక్కీ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బ‌డ్జెట్ మూవీ ఇది. అయితే ఈ సినిమాలో నేష‌న‌ల్ క్ర‌ష్ హీరోయిన్ గా న‌టించ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఆల్రెడీ మేక‌ర్స్ ర‌ష్మిక‌ను సంప్ర‌దించ‌గా.. ఆమె వెంట‌నే ఓకే చెప్పింద‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుంద‌ని అంటున్నారు. మొత్తానికి ర‌ష్మిక ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ కెరీర్ ను ప‌రుగులు పెట్టేస్తోంది.