దర్శకుడు కి ఫోన్ చేసి మరి ఆ హీరోను పొగిడిన శ్యామ్.. అతను ఎవరంటే..?

సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె సోలోగా నటించిన సినిమాకు కూడా రూ.20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలను కొల్లగొట్టేంత మార్కెట్ సంపాదించుకుంది. సమంత ఉన్న సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇక సమంత గతంలో యూత్ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్‌తో ఏ రేంజ్ లో ప్రేమాయణం నడిపిందో అందరికీ తెలుసు. వీళ్ళ ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్ళింది. కానీ చివరి ఏమైందో తెలియదు కానీ వీళ్ళ లవ్ బ్రేకప్ అయింది.

ఆ తర్వాత ఆమె అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. నాలుగేళ్ల తర్వాత నాగచైతన్యతో కూడా విడాకులు జరిగాయి. ప్రస్తుతం సోలో లైఫ్ గ‌డుపుతున్న సమంత తన కెరీర్‌లో బిజీ స్కేడ్యుల్ గడుపుతుంది. ఇక ఇటీవ‌ల‌ సమంత సిద్ధార్ద్‌ను పొగడ్తలతో ముంచెత్తింది అని కోలీవుడ్ వర్గాల నుంచి న్యూస్ జోరుగా వినిపిస్తుంది. సిద్ధార్థ్‌ హీరోగా నటించిన చిన్న సినిమా రిలీజై తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో ఇలాంటి గొప్ప సినిమా చూడలేదు అంటూ పొగిడేస్తున్నారు.

ఇలాంటి సినిమాలు నటించడమే కాకుండా నిర్మించినందుకు సిద్ధార్థ్‌కు కూడా మంచి లాభాలే వచ్చాయి. అయితే ఈ పొగిడే లిస్టులో సమంత కూడా ఒకరు. డైరెక్ట్ గా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టలేదు.. కానీ మూవీ డైరెక్టర్ అరుణ్ కుమార్ కు ఫోన్ చేసి మరి ఈమె మాట్లాడిందట. సినిమా చాలా అద్భుతంగా ఉందని.. ఇందులో సిద్ధార్థ్ తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అందించాడని.. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా చూడలేదు అంటూ చెప్పుకొచ్చిందట. ఇలాగే మంచి సినిమాలు తీస్తూ ముందుకు వెళ్లాలి అంటూ అరుణ్ కుమార్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పిందట సమంత. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.