భయపెట్టిస్తున్న పొలిమేర-2 ట్రైలర్..!!

కరోనా సమయంలో ఓటిటిలో మా ఊరి పొలిమేర అనే సినిమా విడుదలై ఎటువంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని అందుకుంది.ఇందులో నటించిన సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను ప్రధానోపాత్రలో నటించారు. చేతబడి అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది..తాజాగా మా ఊరి పొలిమేర-2 రాబోతోందని తెలిసి ప్రేక్షకుల సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ మూడవ తేదీన ఈ సినిమా విడుదల కాబోతూ ఉండడంతో చిత్ర బృందం కొన్ని గంటల క్రితం ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది..

ఈ సినిమా సత్యం రాజేష్ కెరియర్ లోని బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఈ చిత్రాన్ని అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. మా ఊరి పొలిమేర-2 చిత్రాన్ని AAA సినిమాస్ లో ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.. ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది అసలు చేతబడులు అనేవి నిజంగానే ఉన్నాయా అనే కథాంశంతో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది.

పొలిమేరలో ఒక గుడి ఉంటుంది ప్రతి ఊరి గుడికి ఒక హిస్టరీ ఉంటుంది ఆ గుడికి మాత్రం మిస్టరీ ఉండడం అంటూ గుడుచుట్టు కథను తిప్పేశారు అయితే ఈ గుడికి ఒక శాపం ఉందని నాగబంధం తెంచాలి అంటే.. బంధాన్ని తెంచుకోవాలి అంటూ నరబలి చేయాలంటూ సీన్స్ సస్పెన్స్ గా చూపించడం జరిగింది. ఇందులోని ప్రతి ఒక్కరి నటన చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఈ సినిమా కాస్త వైలెంట్ గా భయభ్రాంతులకు గురి చేసే విధంగా కనిపిస్తోంది. ఒళ్ళు గగూర్కురిచేలా కొన్ని సన్నివేశాలు కనిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.