బాలకృష్ణకు ఆ విషయం తెలియడంతో షాక్ అయ్యా శ్రీ లీల కామెంట్స్ వైరల్..

ఇండస్ట్రీ లోకి వచ్చిన కొంతకాలానికి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీ లీలా. వరుసగా టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించే అవకాశాన్ని తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమోగిపోతుంది. ఓవైపు కథానాయకగా ఆడిపాడుతూనే.. మరోవైపు భగవంత్ కేసరి లో బాలకృష్ణ కుమార్తెగా నటించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా మెప్పించింది. యాక్షన్, కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ ఇంటర్వ్యూల శ్రీలిల పాల్గొంది.

ఇందులో మాట్లాడుతూ భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. సెట్లో బాలకృష్ణని మొదటిసారి చూడగానే మీ రియాక్షన్ ఏంటి అని ఇంటర్వ్యూవర్‌ అడగగా ఆర్మీ ట్రైనింగ్ నేపథ్యంలో సాగే సీన్ ఈ సినిమా ఫస్ట్ షార్ట్.. నేను పుషప్స్‌ చేయలేకపోతుంటే ఆయన పట్టుబడి చేయిస్తుంటారు. షూటింగ్ తర్వాత నిజంగానే నీకు పుషప్స్‌ చేయడం నిజంగానే రాదా అని బాలకృష్ణ అడిగారు. దర్శకుడు అలా చేయమన్నారని సమాధానం ఇచ్చా అంటూ నవ్వుతూ చెప్పింది. బాలకృష్ణని తొలిసారి చూడగానే భయమేసిందని.. ఆయనను కలిసి మాట్లాడాక టెన్షన్ అంతా పోయిందని చెప్పుకొచ్చింది. ఆయనది చిన్నపిల్లల‌ మనస్తత్వాం స్వీట్ పర్సన్ అంటూ వివరించింది శ్రీ లీల.

భగవంత్ కేసరి కుమార్తెగా నటించడం మీకు ఎలా అనిపించింది అని ఇంటర్వ్యూ అడగగా.. గ్లామర్ రోజు చేయడానికి చాలా సినిమాలో ఉంటాయి. కానీ ఎమోష‌న్స్‌తో కూడిన.. యాక్టింగ్ కి ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు అరుదుగా దొరుకుతాయి.. అలాంటి వాటిలో ఈ మూవీ ఒకటి. ఈ కథ వినగానే నాకు నచ్చింది.. నటిగా నన్ను నిరూపించుకోద‌గిన సినిమా కూడా ఇది. ఇప్పుడు ఈ అవకాశాన్ని వదులుకుంటే భవిష్యత్తులో మళ్ళీ రాదేమో అనిపించింది అంటూ వివ‌రించింది. ప్రస్తుతం శ్రీ లీల అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది డ్యాన్స్. ఇందుకు సంతోషమే కానీ నటన‌ పరంగా కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని నేను భావిస్తున్న.. ఈ సినిమాలో భగవంత్ కేసరి పాత్రతో ఆ కల కూడా నెరవేరుతుందని ఆశిస్తున్న అంటూ వివరించింది.

ఇక నటనపరంగా బాలకృష్ణ ఏమైనా సలహాలు ఇచ్చారా అని ఇంటర్వ్యూలో అడగగా ఒక నటుడుగా బాలకృష్ణకు ఎంతో అనుభవం ఉంది. సినిమాతో పాటు ఇతర రంగాలపై కూడా ఆయనకు చాలా పరిజ్ఞానం ఉంది. నేను మెడిసిన్ పరీక్ష రాసి వచ్చిన తర్వాత అందులోని విషయాలపై ఆయన లోతుగా విశ్లేషించేవారు. ఈయన వైద్య విద్య చదవలేదు కదా అయినా ఇవన్నీ ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయేదాన్ని.. షూటింగ్ టైంలో ఎన్నో విషయాలు పంచుకునేవారు. ఏ భావోద్వేగాన్ని ఎలా పలికించాలి.. ఏ సంభాషణ ఎలా చెప్పాలి.. ఆయన సలహాలు ఇచ్చేవారు అంటూ చెప్పింది. ఇక కాజల్‌తో తన అనుభవాన్ని వివరిస్తూ బ్యూటీ విత్ బ్రెయిన్.. అని ఆమె టైమింగ్ అద్భుతం.. నాకు కొత్త విషయాలను తెలిసాయి.. కాజల్‌తో కలిసి నటించడం ఓ అందమైన జ్ఞాపకం అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే ఈ సినిమాలో ప్రతి సీన్‌మా నాకు చాలెంజింగ్‌గా ఉందని.. ఈ పాత్ర కచ్చితంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఈ సినిమాలో బాలయ్యను చిచ్చా అని పిలుస్తా.. నిజ జీవితంలో మా అమ్మ నాకు చిచ్చా. ధైర్యంగా ఉండమని భగవంత్ కేసరి సినిమాలో చెప్పినట్లు.. నిజ జీవితంలో అమ్మ నాకు చిన్నప్పుడు ధైర్యం నురిపోసేది అందుకే ఈ కథతో బాగా కనెక్ట్ అయిపోయాయి అంటూ చెప్పుకొచ్చింది. అదేవిధంగా చాలా తక్కువ సమయంలో ఇన్ని ఎక్కువ సినిమాల్లో నటించడం ఎలా అనిపిస్తుంది అని అడగగా ఇది నాకు చాలా ఆనందంగా కూడా అనిపిస్తుంది. నాకు తొలి అవకాశం ఇచ్చిన రాఘవేంద్రకు.. నా పైన నమ్మకం ఉంచిన ప్రతి దర్శకుడికి కృతజ్ఞతలు. తీరిక లేకుండా చిత్రీకరణలో పాల్గొంటున్న ఇన్ని సినిమాల్లో ఒకేసారి నటిస్తుండడం బాధ్యతగా భావిస్తున్న అంటూ చెప్పుకొచ్చింది