మహేష్ బాబు – అనీల్ రావిపూడి కాంబో మూవీపై క్లారిటీ ఇదే..

మన టాలీవుడ్‌లో ప్రజెంట్ మోస్ట్ సక్సెస్ ఫుల్ గా ఉన్నటువంటి స్టార్ డైరెక్టర్ల‌లో అనిల్ రావిపూడి ఒకడు. ప్రస్తుతం ఈయన బాలయ్య హీరోగా ” భగవంత్ కేసరి ” సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి అనిల్ రావిపూడి నుంచి రానున్న ఈ సినిమా కూడా మినిమమ్ గ్యారంటీ రిపోర్ట్స్ తో వినిపిస్తుండగా.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా విషయంపై ఓ క్లారిటీ ఇచ్చాడు.

ఇదివరకే ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ” సరిలేరు నీకెవ్వరు ” సినిమా సెన్సేషనల్ హిట్ అందుకోవడంతో మళ్లీ ఆ తర్వాత వీరి నుంచి మరో సినిమా వ‌స్ఉందంటూ రీసెంట్ గానే ఓ బజ్ వైరల్ గా మారింది. అయితే ఈ రూమర్స్ పై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తనకి మహేష్ గారికి మరో సినిమా చేసేలా ఎంతో సాన్నిహిత్యం ఉందని కానీ మహేష్ గారి 29వ సినిమా తాను చేస్తున్నట్టుగా వచ్చిన వార్తలు అన్ని అబద్ధమని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై గత కొన్ని రోజుల క్రితం వచ్చిన వార్తలు ఫేక్ అని తేలిపోయింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.